మోకాలినొప్పి, అధిక రక్తపోటు 11616...India
75 ఏళ్ల మహిళ 15 సంవత్సరాల క్రితం తన భర్త మరణించినప్పటి నుంచి మోకాలు నొప్పి మరియు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆమె “సిద్ధ” చికిత్సని ఐదేళ్లుగా ప్రయత్నించినా గణనీయమైన ప్రయోజనం ఏమీ కలగలేదు. గత ఐదేళ్లుగా ఆమె BP కి అల్లోపతి మందులు తీసుకుంటున్నారు. ఫలితంగా BP 140/90 వద్ద నియంత్రణలో ఉంటోంది. ఒక్కొక్కసారి BP ఎక్కువ కావడం వలన ఆమెకు తలలో తేలికగా అయిపోయి, బ్యాలెన్సు కోల్పోయేలా చేస్తుంది కొన్నిసార్లు ఆమె నడుస్తున్నప్పుడు క్రింద పడిపోతున్నారు. ఆమె మోకాలి నొప్పిని అలోపతి నివారిణితో తగ్గించుకో గలుగుతున్నారు. ఇటీవలే ఆమె అధిక కొలెస్ట్రాల్ కోసం ఔషధం తీసుకోవడం ప్రారంభించారు. 2019 ఆగస్టు 21న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
మోకాలి నొప్పికి:
#1. CC12.1 Adult tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine…QDS
అధిక రక్తపోటుకు:
#2. CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic…TDS
రెండు నెలల తర్వాత ఆమె మొత్తం 25% ఉపశమనం ఉన్నట్లు తెలిపారు. అంతేకాక అప్పటికే అల్లోపతీ మందులు తీసుకోవడం నిలిపి వేసినట్లు చెప్పారు. 2020 ఫిబ్రవరి 25 నాటికి ఆమె BP 125/80 వద్ద సాధారణ స్థాయికి చేరింది. మోకాలి నొప్పుల విషయంలో 70% తగ్గింపు కలిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఆమె ఎటువంటి సపోర్టు లేకుండా సులభంగా మెట్లు కూడా ఎక్కగలుగు తున్నారు. కానీ గత కొన్ని వారాలుగా పగటిపూట తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళడం, కొన్ని సమయాల్లో ఆమెకు పాదాలలో మండుతున్న భావనా కలుగుతున్నాయి. అందువల్ల తరచుగా మూత్ర విసర్జన జారీ, పాదాలలో మంటను పరిగణనలోకి తీసుకొని , #1 మరియు #2 క్రింది విధంగా మెరుగు పరచబడ్డాయి:
#3. CC18.5 Neuralgia + #1…TDS
#4. CC13.3 Incontinence + #2…BD
మార్చి 14 నాటికి కేవలం రెండు వారాల్లో అన్ని సమస్యల నుండి పూర్తిగా కోలుకున్నట్లు ఐతే అప్పుడప్పుడు మోకాలు నొప్పి మాత్రం స్వల్పంగా ఉందని అది తన వయసు దృష్ట్యా సాధారణమే అని ఆమె తెలిపారు. అ తరువాత 8 నెలలలో అనగా 2020 నవంబర్ నాటికి #1 మరియు #2 నెమ్మదిగా OD నిర్వహణా మోతాడుకు తగ్గించబడ్డాయి. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2021 ఏప్రిల్ నాటికి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.