Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రొస్టేట్ అడేనోమా (ప్రోస్టేట్ లో నిరపాయ గ్రంధి వృద్ధి) 03558...France


65 ఏళ్ల వ్యక్తి 2018 ఆగస్టు నుండి మూత్రవిసర్జన కోసం రాత్రివేళల్లో తరచుగా మేలుకొనేవారు. ఈ సమస్య నెమ్మదిగా  పగటి పూటకు కూడా వ్యాపించింది. 2018 సెప్టెంబర్ 23 అతనికి ప్రోస్టేట్ అడెనోమా (విస్తరించిన ప్రోస్టేట్ మూత్ర ప్రవాహాన్ని పరిమితం చేయడం) అనే వ్యాధిగా నిర్ధారించ బడింది. యూరాలజిస్ట్ ను సంప్రదించగా ప్రోస్టేక్టమీ(ప్రోస్టేట్ ను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించే) శస్త్రచికిత్స సూచించారు, మరియు ఆ సమయంలో పరీక్షల ద్వారా వెల్లడైన మూత్రమార్గం ఇన్ఫెక్షన్ తగ్గడo కోసం ఒరేకెన్ మాత్రలు సూచించారు. యాంటీబయాటిక్ యొక్క దుష్ప్రభావాల గురించి మరియు శస్త్రచికిత్స ద్వారా ప్రోస్టేట్ తొలగింపు గూర్చి ఏర్పడిన భయం కారణంగా ఇతను అల్లోపతి చికిత్స తిరస్కరించారు. ఐతే పరిస్థితి క్రమంగా విషమంగా మారి మరి నాలుగు నెలల తర్వాత అతను రాత్రి కూడా మూత్ర విసర్జన కోసం 5- 6 సార్లు మేల్కొనవలసిన ఇబ్బంది ఏర్పడింది. అతని జీవన ప్రమాణాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. అతను ప్రత్యామ్నాయ మరియు సురక్షితమైన వైద్య చికిత్స కోసం వెతకడం ప్రారంభించారు. 2019 జనవరి 20న అతను ప్రాక్టీషనరును సంప్రదించారు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC12.1 Adult tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.3 Incontinence + CC14.2 Prostate + CC15.2 Psychiatric disorders…6TD

నెమ్మదిగా అయినప్పటికీ స్థిరమైన మెరుగుదల ఉన్నందున అతను రెమిడీ కొనసాగించారు. ఐదు నెలల తర్వాత రాత్రి సమయంలో మూత్ర విసర్జన మూడు సార్లకు తగ్గిపోగా పగటి పూట అతనికి ఎటువంటి ఇబ్బంది ఏర్పడడం లేదు. 2020 జనవరి 19 నాటికి అతనికి పూర్తిగా తగ్గిపోయి అప్పుడప్పుడు మాత్రమే రాత్రి సమయంలో మేల్కొనుట జరుగుతోంది. మోతాదు TDS కు తగ్గించబడింది. తర్వాత ఐదు నెలల్లో అతను ఎప్పుడూ రాత్రి లేవవలసిన అవసరం లేదు కాబట్టి మోతాదు OD కి తగ్గించబడింది. చివరికి 2021 జనవరి 3న ఆగిపోయింది 2021 నాటికి వ్యాధి పునరావృతం కాలేదు.