వృద్ధ శునకానికి కండరాల బలహీనత 03558...France
14 ఏళ్ల ఆడ గోల్డెన్ రిట్రీవర్ అనే జాతి కుక్కకు గత పది నెలలుగా ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. అది ఆకలిని కోల్పోయింది, వేడిగా ఉన్నప్పటికీ ఏవైనా ద్రవపదార్ధాలు బలవంతంగా తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె గంటల కొద్దీ ఒకే స్థానంలో పాక్షిక కోమా వంటి స్థితిలో పడుకొని ఉంటూ కండరాలు పట్టు కోల్పోతున్నది. పశు వైద్యులు ఈ వ్యాధిని కండరాల బలహీనతగా నిర్ధారణ చేసారు. తీవ్రమైన అలసటతో పటుత్వం కోల్పోయి దాని వెనుక కాళ్ళు దాని బరువును మోయలేక పోతున్నాయి. గోల్డెన్ రిట్రీవర్ యొక్క ఆయుర్దాయం పది పన్నెండు సంవత్సరాలే కనుక దానిని పరిగణనలోనికి తీసుకుని వైద్యుడు ఏ ఔషధాన్ని సూచించలేదు కానీ అనాయాస మరణం కోసం మందును సూచించారు. 2019 ఆగస్టు 5న యజమాని ప్రాక్టీషనరును సంప్రదించి క్రింది రెమిడీ పొందారు:
#1. CC1.1 Animal tonic + CC3.1 Heart tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC18.4 Paralysis + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…TDS రెమిడీని కుక్క నీరు త్రాగే పళ్ళెంలో నీటిలో కలపాలి.
ఒక వారం తర్వాత యజమాని కుక్క స్థితిలో గణనీయమైన మార్పును ఆనందంగా నివేదించడం జరిగింది. ఇకపై దానిని తినడానికి లేదా త్రాగడానికి బలవంతం చేయవలసిన అవసరం లేదు. బయటకు విహారానికి తీసుకెళ్లినప్పుడు అది గడ్డిమీద కాళ్ళు సాగదీస్తూ పొరులుతున్నది. ఆ తర్వాత ఎనిమిది నెలల్లో మార్పు నెమ్మదిగా ఉంది కానీ స్థిరమైన మెరుగుదల ఉంది కాబట్టి యజమాని #1ని కొనసాగించారు. 2020 మార్చిలో కుక్క యొక్క ఆహారములో మార్పు చేసి పేకేజ్ చేసిన క్రాకెట్స్ మరియు పాటీస్ బదులు తాజా కూరగాయలు మరియు మాంసంతో భర్తీ చేయబడింది. ఇది కుక్క త్వరగా కోలుకొనడానికి సహాయ పడింది. ఏప్రిల్ 22న యజమాని చెప్పిన మాటలు బట్టి కుక్క అడుగులు చిన్నగా వేస్తున్నప్పటికీ వారితో పాటు వాకింగ్ చేయడము కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో #1 క్రింది విధంగా మెరుగుపరచబడినది.
#2. CC3.7 Circulation + CC20.5 Spine + #1…TDS
తర్వాత కొన్ని నెలలపాటు అభివృద్ధి కొనసాగింది. 2021 జనవరి 8న యజమాని తన కుక్కలో చైతన్యము, మరియు మునుపటి ధైర్యము చేకూరి సాధారణ స్థితికి చేరుకున్నట్లు నివేదించారు. కనుక మోతాదు మూడు వారాల పాటు BD కి అనంతరం OD నిర్వహణ మోతాదుగా తగ్గించారు. జనవరి 2021 నాటికి 16 సంవత్సరాలు వచ్చినప్పటికీ అది ఆరోగ్యంగానే తన జీవనం సాగిస్తోంది.
కుక్క యజమాని వ్యాఖ్య:
చికిత్స ప్రారంభించిన వారం తర్వాత యజమాని ఇలా రాశారు. “ఇది పునరుద్ధానం! దీనికి మరలా జీవనం చేకూరింది. ఆకలి పెరిగి సాధారణంగానే అన్న పానీయాలు తీసుకుంటోంది. గడ్డి మీద సాగదీయడం మరియు చుట్టుకోవడం ద్వారా తన ఆనందాన్ని తిరిగి పొందుతోంది. అందుకోసం చేసిన చికిత్స దానికే కాదు మాకు కూడా శ్రేయస్కరమైనది.