కడుపులో ఆమ్లము కారణముగా నడుము నొప్పి 11508...India
40- ఏళ్ల మహిళ గత ఏడాది కాలంగా వెన్నుక్రింది భాగంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఇది హైపర్ ఎసిడిటీ కారణంగా కావచ్చని ఆమె భావించారు. వారములో అనేకసార్లుఆమె సాయంత్రం భోజనం తర్వాత త్రేనుపులుమరియు వాయువునుఅనుభవించారు. 2019 ఫిబ్రవరిలో ఒక వైద్యుడిని సంప్రదించారు. మూడు నెలలు పాటు ఆమెకు ఫిజియోథెరపీ మరియు బాహ్య చర్మం పై పూతగా రాయుటకు ఒక జెల్ క్రీమును సూచించగా వాటితో ఆమెకు పూర్తి ఉపశమనం లభించింది. చికిత్సఆపిన ఒక నెల తర్వాత లక్షణాలు తిరిగి కనిపించడం ప్రారంభించాయి.ఆ తర్వాత నెలలో ఆమె నడుము నొప్పి ఎంత తీవ్రంగా మారిందంటే ఆమె దైనందిన విధులు నిర్వహించడంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019 జూలై 15న ప్రాక్టీషనరునుసంప్రదించినప్పుడు ఆమె తన బాధను 10/10 రేట్ గా నమోదు చేశారు. ఆమెకుక్రిందిరెమిడీ ఇవ్వబడింది:
#1. CC4.10 Indigestion...TDS
మూడు రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ లక్షణాలు మరియు వెన్ను నొప్పి రెండింటిలో 40% మెరుగుదల కలిగింది. మరో నెలతరువాత 70% మెరుగుదల గమనించబడింది. సెప్టెంబర్ 21న ఆమె 80%మెరుగుదల ఉన్నట్లు తెలపడంతో #1 యొక్క మోతాదు BD కి తగ్గించబడింది.అయినప్పటికీ ఆమె గత వారం రోజులుగా మలబద్ధకంఎదుర్కొంటున్నందువలన అదనపు రెమిడి ఇవ్వబడింది:
#2. CC4.4 Constipation…TDS
రెండు వారాల్లో అక్టోబర్ 6 నాటికి ఆమె ప్రేగు కదలిక సాధారణమగుటచేత #2ను ఆపడానికి ముందు రెండు వారాలపాటుBD కి తగ్గించబడింది. ఆమె వెన్ను నొప్పి మరియు ఉబ్బరం 90%మెరుగుపడడం వలన#1వ మోతాదుODకి తగ్గించబడింది. నవంబర్ 9 నాటికి ఆమెకు 100% ఉపశమనం కలగడంతో 2019 నవంబర్ 23న రెమిడీ ఆపివేయబడింది. 2020అక్టోబర్ నాటికి ఆమె యొక్క గ్యాస్ట్రిక్ లక్షణాలు పూర్తిగా కనుమరుగైఆమె తన భయాలనన్నింటినీఅధిగమించారు.