ఆమ్లపు మంట, మలబద్ధకము, భయాలు 11210...India
గత రెండేళ్లుగా 52 ఏళ్ల మహిళకు ఆమ్లము అన్నవాహిక లోనికి మరలడం, మలబద్ధకం మరియు కుక్కర్ లేదా ఫుడ్ మిక్చర్ విజిల్ యొక్క ఆకస్మిక శబ్దము, కరెంట్ ఇస్త్రీ పెట్టె లేదా మొబైల్ చార్జర్ నుండి విద్యుత్ షాక్ కలుగుతుందేమో అనే రకరకాల భయాలతో బాధపడుతూ ఉన్నారు. ఆమ్ల సమస్య మరియు మలబద్ధకం కోసం ఆమె వైద్యులు ఆరునెలల పాటు మందులు తీసుకోవలసినదిగా సూచించినా నెల తరువాత ఎటువంటి మార్పు రాకపోవడంతో వాటిని ఆపివేసి హోమియోపతి చికిత్స ప్రారంభించి నాలుగు నెలలు తీసుకున్నారు. ఇది కూడా సహాయం చేయకపోవడంతో ఆమె వైబ్రియానిక్స్ఎంచుకున్నారు. 2020 ఫిబ్రవరి 17 న ఆమె ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic…TDS
రోగి ఎక్కువ నీరు తాగాలని సరియైన వేళకు భోజనం చేయాలని అధిక మసాలా లేదా వేపుడు ఆహారాన్ని నిషేధించాలనిప్రాక్టీషనరు సూచించారు. మార్చి 9న మూడు వారాల తర్వాత రోగి తన వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా కనుమరుగు అయ్యాయని తెలిపారు. మోతాదు రెండు వారాలపాటు ODకి తగ్గించి మార్చి 25న ఆపివేశారు. 2020 డిసెంబర్ నాటికి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు.