మోకాళ్ళ నొప్పులు 03527...France
72-ఏళ్ల మహిళ మాజీ శారీరక విద్య ఉపాధ్యాయురాలు మరియు యు.కె జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి గత 15 సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు (కుడి మోకాలు లోని నెలవంక వంటిదానికి (మెనిస్కస్) ఏడు సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేసారు). ఆమె ఈ నొప్పి నుండి ఉపశమనం కోసం తన కెరీర్ మొత్తం పదేపదే నొప్పి నిరోధక మందులు తీసుకున్నారు, కానీ 5-6 సంవత్సరాల క్రితం వాటిని తీసుకోవడం మానేసారు. ఎందుకంటే ఇవి ఆమె మూత్రపిండాలను దెబ్బతీయడం ప్రారంభించాయి. సాధ్యమైనంతవరకు నొప్పి నివారణ మందులు తీసుకోవడం మానేసి బదులుగా సిలీసియా, కొల్లాజెన్, పసుపు వంటి అనుబంధ ఆహార పదార్థాలను తీసుకునేవారు. 2017 నవంబర్ నాటికి ఆమె ఎడమ కాలు నొప్పి అత్యంత బాధాకరంగా మారడంతో ఆమెకు నడవడం, డ్రైవింగ్ చెయ్యడం అసాధ్య మయ్యింది. అందుచేత ఆమె ఎడమ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇట్టి నిరాశావాహ స్థితిలో 2018 మే 31న ఆమె ప్రాక్టీషనర్ ను సంప్రదించినప్పుడు ఆమె ఆత్మ విశ్వాస లోపంతో కూడా ఉన్నట్లు కనుగొని క్రింది రెమిడీ ఇచ్చారు: :
#1. NM2 Blood + NM3 Bone Irregularity + NM12 Combination-12 + NM20 Injury + NM22 Liver + NM40 Knees + NM59 Pain + NM63 Back-up(Booster) + NM86 Immunity + BR18 Circulation + BR21 Injury + SR348 Cortisone + SR573 Osteoporosis + potentised Codeine-Doliprane 200C...6TD in water
సెప్టెంబర్ 4 నాటికి 20% మెరుగుదల కనిపించింది. నొప్పి కాస్త భరించగలిగే స్థాయికి చేరినందువల్ల #1 మోతాదు TDS కి తగ్గించబడింది. చికిత్స పట్ల తనకు నమ్మకం ఏర్పడినట్లు ప్రాక్టీషనరుతో చెప్పారు. విటమిన్ C,D, మరియు K2 యొక్క సప్లిమెంట్లు తీసుకోవలసిందిగా ఆమెకు సలహా ఇచ్చారు ఎందుకంటే ఫ్రాన్స్ లో చాలామంది సీనియర్లు వీటి లోపంతో బాధ పడుతున్నట్లు ప్రాక్టీషనరు అభిప్రాయం. 2019 జనవరి నాటికి ఆమె వ్యాధి లక్షణాలు మూడోవంతు మాత్రమే మెరుగుపడముతో ప్రాక్టీషనర్ పురోగతి నెమ్మదిగా ఉందని భావించి రెమిడీని క్రింది విధంగా సవరించారు:
#2. NM3 Bone Irregularity + NM40 Knees + NM59 Pain + OM5 Circulation + BR18 Circulation + SM28 Injury + SM36 Skeletal + SR348 Cortisone + SR573 Osteoporosis + potentised Codeine-Doliprane 200C...TDS నీటిలో
ఏప్రిల్ నాటికి 80% మెరుగుదల కనిపించింది. జూన్ చివరి నాటికి నొప్పి మాయం అవడంతో ఇప్పుడు ఆమె నడవడంతో పాటు డ్రైవింగ్ కూడా చేయగలుగుతున్నారు. ఆమెను శస్త్రచికిత్సనుండి దూరం చేసి నందుకు వైబ్రియానిక్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 4 నుండి మోతాదు క్రమంగా తగ్గిస్తూ 2019 సెప్టెంబర్ 30 నాటికి ఆపివేశారు. 2020 మే లో ఆమె ప్రాక్టీషనరుకు ఒక కార్డును పంపుతూ “నా మోకాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది నేను సంతోషంగా ఉన్నాను” 2020 సెప్టెంబర్ చివరిలో రోగిని వివరాలకోసం పిలిచినప్పుడు నొప్పి పునరావృతం కాలేదని ఈ నివారణ ఒక అద్భుతం అని ఆమె తెలిపారు.
నొప్పితో బాధపడుతున్న రోగులందరికీ నొప్పి నివారిణి కోడిన్ డోలిప్రేన్(ప్యారాసిటమల్) చాలా మంచి ఫలితాలు ఇస్తున్నట్లు ప్రాక్టీషనర్ పేర్కొంటున్నారు.
108CC బాక్స్ ఉపయోగించి నట్లయితే CC12.1 Adult tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ Pain + CC20.5 Spine + CC20.6 Osteoporosis ఇవ్వండి.