ఒరో ఫారింజి యల్ డిస్పాజీయ (ఆహారం మ్రింగడం లొ ఇబ్బంది) (Oropharyngeal dysphagia) 11613...India
57 ఏళ్ల వనిత మింగడంలో ఇబ్బంది కలిగి ప్రతి ముద్దకు పొరబారుతున్న పరిస్థితి కలుగుతోంది. 2019 మార్చి 12న పది రోజులు బాధ పడిన తర్వాత వైద్యుని సంప్రదించగా ఈ పరిస్థితిని ఓరోఫారింజియల్ డిస్పాజియాగా గుర్తించి అలోపతి మందులు సూచించారు. ఆమె నోటిలో పుండ్లు కూడా ఉన్నందున 2019 ఏప్రిల్ 5న జరిగిన పరీక్షలలో ఇది ఓరల్ లైకెన్ ప్లానస్(oral lichen planus)అనే ఆటో ఇమ్యూన్ లేదా స్వయం ప్రతిరక్షక రుగ్మత గా నిర్ధారించి దీనికి ఆమెకు మందులు ఇచ్చారు. ఐదు నెలల తర్వాత నోటి పుండ్లు తగ్గిపోవడంతో 2019 సెప్టెంబర్ 25న మందులు ఆపివేశారు కానీ డిస్పాజియా కొనసాగుతూ ఉండడంతో 2019 నవంబర్ 26న ఎండోస్కోపీ చేయించుకున్నారు. ఇది సన్నని నిరపాయమైన పొర రూపంలో శ్వాసకోశ మార్గము మరియు అన్నవాహిక మధ్యలో ఏర్పడినట్లు కనుగొన్నారు. ఈ పొర ను తొలగించడానికి శస్త్రచికిత్స సూచించ బడింది కానీ రోగి వైబ్రో చికిత్స ఎంచుకుని అలోపతి ఔషధాలను తీసుకోవడం అపి వేశారు. 2019 నవంబర్ 27న ప్రాక్టీషనరును సంప్రదించినప్పుడు ఆమె తన ఆరోగ్యం గురించి ఆందోళనతో ఉంది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.10 Indigestion + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC18.4 Paralysis…6TD ఒక వారం వరకూ అనంతరం TDS
అన్నవాహికలో ఆహారం యొక్క కదలిక నెమ్మదిగా ఉన్నందున బహుశా కండరాలు బలహీనపడడం కారణం కావచ్చని భావించి CC18.4 Paralysis చేర్చబడింది. రెండువారాల తర్వాత అనగా డిసెంబర్ 12న ఆమెకు పొరబారుతున్న అనుభూతి పూర్తిగా కనుమరుగయింది అని తెలిపారు. 2020 జనవరి 5న మోతాదు OD కి తగ్గించి 2020 మార్చి 5 నాటికి క్రమంగా తగ్గించి ఆపివేశారు. ఇప్పుడు CC12.1 Adult tonic మరియు CC17.2 Cleansing, ప్రతీ నెలకు మార్చి తీసుకునే చక్రం లో ఉన్నారు. 2020 సెప్టెంబర్ నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదు.