బిగుసుకుపోయిన భుజం 11620...India
2019 జూన్ లో 53 ఏళ్ల వ్యక్తికి ఎడమ ముంజేతిలో నొప్పి రావడం ప్రారంభమైంది. కొద్ది నెలల్లో నొప్పి బాగా పెరిగి పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందంటే అతను చేయి కూడా ఎత్తి లేకపోయాడు. 2019 అక్టోబర్ 11న అతను న్యూరాలజిస్టును సంప్రదించగా దీనిని స్తంభించిపోయిన భుజముగా నిర్ధారించారు. సాధారణంగా మధుమేహ రోగులు భుజము యొక్క స్తంభన తో ఇబ్బంది ఉంటారు కనుక వైద్యుడు రక్తంలో చక్కెర పరీక్షలకు HbA1C మరియు FPG (Fasting Plasma Glucose) ఆదేశించారు. రెండు పరీక్షల్లో రక్తంలో చక్కెర స్థాయి సాధారణ పరిధిలోనే ఉన్నట్లు నిర్ధారించారు. అతనికి నొప్పి నివారణ మందు ఇవ్వబడింది కానీ ఇది రోగికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వడంతో దానిని ఒక వారం మాత్రమే తీసుకున్నారు. మూడు నెలలుగా అతను తీసుకున్న ఫిజియోథెరపీ కూడా అతనికి సహాయం చేయలేదు.
ఇదే సమయంలో అతను వైబ్రియానిక్స్ లో తన శిక్షణ పూర్తి చేసుకుని స్వయంగా ప్రాక్టీషనర్ అయ్యారు. 2020 ఫిబ్రవరి 2న తన కోసం కింది రెమిడీ తయారు చేసుకున్నారు.
CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…TDS
అతను వేరే మందులు ఏమీ తీసుకోలేదు, రెండు వారాల్లో నొప్పులు విషయంలో 75% ఉపశమనం పొందారు కాబట్టి ఏమీ ఇబ్బంది లేకుండా చేతులు ఎత్తగలుగుతున్నారు. ఫిబ్రవరి 22 నాటికి నొప్పి మాయం అవడంతో తన చేతిని సులువుగా కదిలింప గలుగు తున్నారు. అందుచేత మోతాదు ఒక వారం OD కి తగ్గించి మార్చి 1న ఆపివేయబడింది. 2020 జూలై 31 నాటికి అతని భుజం నొప్పి పునరావృతం కాలేదు.