అజీర్ణం, తలనొప్పి 11606...India
ప్రాక్టీషనరుగా అర్హత సాధించిన వెంటనే గత నాలుగైదు సంవత్సరాలుగా రోజు విడిచి రోజు వచ్చే కడుపులో మంట, ఆసిడ్ రిఫ్లక్స్, తేలికపాటి కడుపునొప్పితో బాధపడుతున్న32 ఏళ్ల పనిమనిషికి చికిత్స చేశారు. రోగి తన నలుగురు పిల్లలను పోషించడానికి అనేక గృహాల్లో పని చేయవలసి ఉన్నందున ఆమె ఆరోగ్యం లేదా ఆహారం పట్ల శ్రద్ధ చూపలేదు మరియు తన అనారోగ్యాలకు చికిత్స కూడా తీసుకోలేదు. రెండు నెలల క్రితం తాగుబోతు భర్త కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారి ఆమెకు ఇంచుమించు ప్రతీరోజూ తలనొప్పి రావడం ప్రారంభమైంది కొన్నిసార్లు తల మొత్తం తిరుగుతూ ఉంటుంది ఇతర సమయంలో ఒకేవైపు నొప్పి వస్తుంది. 2019 మార్చి 19 న ప్రాక్టీషనర్ ఆమెకు క్రింది రెమిడి ఇచ్చారు:
#1. CC4.10 Indigestion + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
రోగి ఎక్కువ గా నీరు త్రాగాలనీ, కూరగాయలు మరియు పండ్లను ఆహారంలో చేర్చాలనీ, వేయించిన ఆహారాన్ని నివారించాలనీ, సాధ్యమైనంత వరకూ భోజన సమయాన్ని మార్చకుండా ఒకే సమయంలో తీసుకోవాలని సూచించారు. వారం తర్వాత ఆమెకు స్వల్ప ఉపశమనం లభించింది అయితే పనిచేయడానికి ప్రాక్టీషనర్ ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు మగత ప్రారంభమై పని అపవలసి వచ్చింది. వెంటనే ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#2. CC10.1 Emergencies…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకు ఇవ్వబడింది ఆ తర్వాత ఆమె స్థితి సాధారణమవడంతో #2 నిలిపివేయబడింది.
వారం తర్వాత రోగి గ్యాస్, యాసిడ్ రిఫ్లెక్స్, మరియు కడుపులో మంట నుండి 100% ఉపశమనం పొందారు కానీ తలనొప్పి విషయంలో 80% మాత్రమే ఉపశమనం కలిగింది. మరో వారం తర్వాత తలనొప్పి కూడా మాయమైంది. 2019 ఏప్రిల్ 12న మోతాదు OD కి తగ్గించబడింది. మోతాదు క్రమంగా తగ్గించడానికి ఆమె ఇష్ట పడలేదు కాబట్టి ఆపడానికి ముందు రెండు నెలలు OD గానే కొనసాగించింది. 2019 జూన్ లో ప్రాక్టీషనర్ మరొక ప్రాంతానికి వెళ్ళడం చేత రోగి ఆమె వద్ద పనిచేయడం లేదు. ఐతే 2020 జూన్ నాటికి రోగి ఎటువంటి వ్యాధి లక్షణాలు పునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు.