ఆందోళన 11597...India
2018 మే 5న 47 ఏళ్ల మహిళ నిరంతరం చింతించే అలవాటు అధిగమించడానికి ప్రాక్టీషనరును సంప్రదించారు. ఆమె మానసిక ఆందోళనకు గురియై నప్పుడు అస్థిరమైన నడకనూ, హృదయంలో భారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ అవిశ్రాంతి మరియు ఆందోళన యొక్క లక్షణాలు 2017 డిసెంబర్ లో ప్రారంభమయ్యాయి. ఆమె ఋతు వ్యవస్థ అనిశ్చితంగా ఉన్నప్పటికీ ఈ సమస్యకు చికిత్స ప్రారంభించాలని ఆమె భావించలేదు. ఆమె కేవలం కాల్షియం మాత్రలు మాత్రమే తీసుకుంటూ అవే కొనసాగించారు.
ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia…TDS
మే 15న రోగి తనకు ఆనందంగా, విశ్రాంతిగా, మరింత శక్తివంతంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆందోళన లేకుండా ఉండే విషయంలో 70% మెరుగుదల ఉందని ఆమె భావించారు. 5వారాల తర్వాత జూన్ 20న అనిశ్చిత ఋతు క్రమానికి క్రింది రెమిడి జోడించబడింది:
#2.CC8.1 Female tonic + CC8.8 Menses irregular + #1…TDS
జులై 20న రోగి తనకు ప్రశాంతంగా ఉంది కనుక రెమిడీ విషయంలో గానీ లేదా మోతాదు తగ్గింపు విషయంలో గానీ ఎటువంటి మార్పు లేకుండా కొనసాగించమని అభ్యర్ధించారు. ప్రతీనెలా రీఫిల్ ఆమె స్వీకరిస్తున్నారు కానీ ఎంత మెరుగుదల శాతం ఉందో అంచనా వెయ్యలేక పోతున్నారు. పూర్తిగా కోలుకోవడం గురించి చెప్పడంలో ఆమె సంకోచించిస్తున్నట్లు ఈ రెమిడీ మీదనే ఆధారపడినట్లు ప్రాక్టీషనరు గ్రహించారు. రోగి మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే భావనతో ఆమె సహజ ప్రతిభను గమనించి సంగీతం లేదా కళలకు సంబంధించిన తరగతులలో చేరాలని సూచించారు. రోగికి ఈ సలహా సముచితంగా తోచి వెంటనే సంగీత పాఠాలకు తన పేరు నమోదు చేయించు కున్నారు.
విశ్వాసం మరియు శ్రద్ధతో #2 ను కొనసాగించారు. నవంబర్ 7 నాటికి ఆమె మానసిక ఆరోగ్యం, శారీరక శ్రేయస్సు మరియు దృఢత్వం విషయంలో 100% మెరుగుదలను గుర్తించి ధైర్యంగా తెలియ జేశారు. ఆమె ఋతు సమస్య అలాగే కొనసాగింది. ఐతే ఆమె ఋతు విరతి కారణంగా ఏర్పడే సహజమైన శారీరక మార్పులకు లోనవుతున్నట్లు నమ్మకంగా ఉండడంతో క్రమరహిత రుతుస్రావం కోసం ఏ మందులు తీసుకోలేదు. 5 వారాల సమయంలో మోతాదును క్రమంగా తగ్గిస్తూ 2018 డిసెంబర్ 10న రెమిడీ నిలిపివేయ బడింది. 2020 అక్టోబర్ నాటికి ఆమె ఆరోగ్య సమస్యలు అన్నింటినుండి విడుదలై వ్యాధి లక్షణాల పునరావృతం ఏమి లేకుండా చురుకుగా చక్కటి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు.