బాధకారమైన ఋతుక్రమం 11621...India
32-ఏళ్ల మహిళ 2013 నుండి ఋతునొప్పీతో బాధపడుతూ ఉన్నప్పటికీ మందులేవీ తీసుకోకుండా ఏదో విధంగా సర్దుకుంటూ ఉండేవారు. ఈమె ఒక సంప్రదాయ కుటుంబంలో పెళ్లి చేసుకున్నమీదట ఋతు సమయంలో ఆమె ఎటువంటి మత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొన కూడదు. అందుచేత ఆమె 2013లో కొన్ని సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తన ఋతుక్రమాన్ని పొడిగించడానికి స్టెరాయిడ్స్ వాడటం ప్రారంభించారు. ఈ విధంగా సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు స్టెరాయిడ్లు వాడుతూ ఉండేవారు. అయితే వీటి యొక్క దుష్ప్రభావాలు గమనించి నాలుగు సంవత్సరాల తర్వాత 2017లో వీటిని వాడడం మానివేయడం జరిగింది కారణం ఈ మందులు వీరి ఋతు సమస్యలను మరియు ఋతు నొప్పిని పెంచి ఆమె సమస్యను మరింత తీవ్రం చేసి ఐదు రోజులపాటు తిమ్మిరి కూడా కలిగిస్తున్నాయి. పేషెంటు ఈ వ్యాధికి కారణం తను అంతకు ముందు తీసుకున్న మందుల ఫలితం అని భావించారు. ఆమెకు మందులు తీసుకోవడం ఇష్టం లేక అలాగే ఓపిక పడుతూ విశ్రాంతి మరియు నిద్రలేకుండా నొప్పిని భరిస్తూ ఉండేవారు.
2019 డిసెంబర్ 1న ఆమె ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic + CC15.4 Eating disorders…TDS, చివరి కోంబో CC15.4.వేయడంలో ప్రధాన ఉద్దేశం ఆమె వేయించిన ఆహారాన్ని ఇష్టంగా తినడం వల్ల అధిక బరువు కలిగి ఉండడం. డిసెంబర్ చివరి నాటికి రోగి తన కాలు నొప్పి మరియు తిమ్మిరి విషయంలో 10-20 శాతం తగ్గింపు గమనించారు. మరో నెలలో అనగా ఫిబ్రవరి చివరినాటికి 30-40 శాతం మెరుగుదల అనంతరం ఫిబ్రవరి నెలాఖరుకు మెరుగుదల 80% వరకు పెరిగింది. ఏప్రిల్ 1న నొప్పి మరియు తిమ్మిరి అనేవి అదొక గడిచిపోయిన కాలంలోని విషయాలవలె పూర్తిగా అదృశ్య మయ్యాయని తెలిపారు, అందుచేత మోతాదు OD కి తగ్గించబడింది. 2020 మే11 నాటికి ఆమె అధిక బరువు మరియు ఇష్టమైన ఆహారముపై మక్కువ కోసం చికిత్స ప్రారంభించడంతో పై రెమిడీ నిలిపివేయ బడింది. 2020 అక్టోబర్ నాటికి నొప్పి గానీ, మానసిక కల్లోలం గానీ పునరావృతం కాలేదు(ఇది ఆశ్చర్య కరమైన బోనస్). ఋతుస్రావం కావడానికి ముందు ఈ సమస్య తరుచూ ఏర్పడుతున్నప్పటికీ ఈ విషయం ఆమె ప్రాక్టీషనరుకు వెల్లడించలేదు!