Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

తలపోటు, సైనసైటిస్, అలెర్జీ 11621...India


41 సంవత్సరాల వ్యక్తి స్వయంగా వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ గత 20 సంవత్సరాలుగా ప్రతీరోజూ తలపోటుతో బాధపడుతున్నారు. ఇతను ధూళి మరియు పుప్పొడి అలర్జీ కలిగి ఉండి ప్రతీరోజూ లేవగానే వరుసగా 10 నుంచి 12 తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి. ఈ తుమ్ముల వలన అతని సైనస్ ఎర్రబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అతని తల్లి నుండి వారసత్వంగా అతనికి సంక్రమించిన తుమ్ముల విషయంలో జాగ్రత్త వహించినప్పటికి 1998లో అతని వంకర తిరిగిన ముక్కు దూలము (సెప్టం) నకు చేసిన చికిత్స అతని శ్వాస అవరోధం మరియు తలపోటు విషయంలో  ఏమాత్రం  సహాయం చేయలేదు. అనేక సంవత్సరాలుగా డాక్టర్లు ముక్కులో వేసుకునే చుక్కలు, యాంటీ హిస్టామిన్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీలు, బాధా నివారణలు సూచించినా ఇవేమీ అతనికి సంపూర్ణ ఉపశమనం కలిగించలేదు, కనుక వారానికి రెండు సార్లు వీటిని తీసుకోవడం ఒక ప్రామాణికంగా మారింది. ఇతను తన తలను తడవకుండా ఉండటానికి ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వర్షం వచ్చేటప్పుడు తల తడవకుండా చూడడం, స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళడం కూడా మానివేశారు. ఎందుకంటే అరగంట సేపు నీటిలో తడిస్తే ఇది తీవ్రమైన తలపోటును కలిగించి ఏదైనా బలమైన పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే ఆ తలనొప్పి నివారణ అవుతుంది.   

2019 నవంబర్ 25న అతను క్రింది రెమిడి తీసుకోవడం ప్రారంభించారు :
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…పది నిమిషాలకు ఒక డోసు చొప్పున ఒక గంట వరకు అనంతరం 6TD 

రెండు రోజుల తర్వాత అతని తల వెనుక భాగంలో ఎల్లప్పుడూ ఉండే నొప్పి స్వల్పంగా తగ్గినట్లు అనిపించింది, అయితే నాసికా అవరోధం విషయంలో 50% ఉపశమనం కలిగింది. ఒక వారం తర్వాత తలనొప్పి  విషయంలో 30% ఉపశమనం కలుగగా నాసా రంధ్రాల అవరోధం, ఎడతెరిపి లేకుండా వచ్చే తుమ్ములు  దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి. అనంతరం ఇతను ఒక రీట్రీట్ కు వెళ్ళినప్పుడు అనుకోకుండా సముద్రంలో, కొలనులో, షవర్ కింద తల తడపడం ఈ విధంగా దాదాపు నాలుగు గంటలు నీళ్లలో తడవవలసి వచ్చినా ఆశ్చర్యకరంగా అతనికి నాసా అవరోధం కలుగలేదు.

మరో నెల తర్వాత అనగా 2020 జనవరి నాటికి అతను తలపోటు విషయంలో 80% మెరుగుదల కనిపించింది. అందువల్ల OTC మందుల అవసరం పూర్తిగా తగ్గిపోయింది. అలాగే ఇతర వ్యాధి లక్షణాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. జనవరి 8-14 తేదీలలో అతను వర్క్ లోడ్ పెరగడం వల్ల అర్ధరాత్రి వరకు పని చేయవలసి వచ్చేది ఈ ఒత్తిడి వలన తలపోటు తిరిగి ప్రారంభమైంది.

అందుచేత అతను అత్యవసర పరిస్థితిలో క్రింది రెమిడీ తయారు చేసుకున్నారు:

#2. CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC19.5 Sinusitis…ప్రతి పది నిమిషాలకు ఒక డోసు చొప్పున రెండు గంటల వరకు (SOS మోతాదు), దీనిని వీరు రెండు సందర్భాల్లోనే తీసుకున్నారు.

మే1 వ తేదీ నాటికీ తలపోటు పూర్తిగా తగ్గిపోయి అతనికి నిద్ర కూడా చక్కగా పడుతోంది. కనుక #1 ని OD కి  తగ్గించి ఒక నెల తర్వాత ఆపివేయడం జరిగింది..కేవలం పని ఒత్తిడి పెరిగి అర్ధరాత్రి వరకు పని చేస్తున్నప్పుడు లేదా అన్నం కూడా తినకుండా ఉన్నప్పుడు అతనికి తలపోటు తిరిగి వస్తోంది. అటువంటి సందర్భంలో  #2 ను ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నప్పుడు పరిస్థితి చక్కబడుతుంది. ఒకవేళ #2, ను తీసుకోవడం మర్చిపోతే తలపోటు తీవ్రమయ్యి ఒక పూట కంటే ఎక్కువ సేపు ఉంటుంది! అందువల్ల అతను దీనికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఎప్పుడైతే తలపోటు లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయో వెంటనే  #2 తీసుకొనడంతో తలపోటు రావడం లేదు. 2020 జూన్ 1 నుండి అతను కోవిడ్ ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకో సాగారు. 2020 అక్టోబరు నాటికి అతనికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నారు.