పునరావృతం అయ్యే కీళ్లనొప్పి (ఆర్థ్రాల్జియా) - పోస్ట్ చికెన్గున్యా 11622...India
32 సంవత్సరాల మహిళ విపరీతమైన కీళ్ల నొప్పులు, తలపోటు, శరీరమంతా నొప్పులు జ్వరము అలసటతో 2020 మార్చి 12వ తేదీన ప్రాక్టీషనర్ వద్దకు వచ్చారు. 4 సంవత్సరాల క్రితం జాయింట్లలో వాపు, తలపోటు, జ్వరము వంటి లక్షణాలతో చికెన్ గున్యాకు అల్లోపతి మందులు తీసుకున్నారు. సంవత్సరం తర్వాత అధిక ఉష్ణోగ్రతతో టైఫాయిడ్ రాగా ఆమె హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. అప్పటినుండి ప్రతీనెలా ఈ లక్షణాలు కనిపిస్తూ ఉండగా ఆమె అల్లోపతి మందులు తీసుకుంటున్నా కొన్ని రోజుల వరకు మాత్రమే ఉపశమనం కలిగి తిరిగి సమస్య పునరావృతం అవుతోంది కనుక ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని భావించారు. ప్రాక్టీషనర్ రోగి ఆందోళనతో ఉన్నారని ఆత్మవిశ్వాసం లోపం కూడా ఉన్నట్లు గుర్తించి క్రింది రెమిడీ ఇచ్చారు:
CC9.2 Infections acute + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain…TDS
రెండు వారాల తర్వాత పేషంటు అన్ని వ్యాధి లక్షణాల నుండి 80% మెరుగుదలతో ఆనందంగా కనిపించారు. ఏప్రిల్ 2 నాటికి నొప్పులు అన్నీ పూర్తిగా తగ్గిపోగా ఆమెకు ఎంతో శక్తివంతంగా ఉన్నట్లు తెలిపారు. మోతాదును ఒక వారం పాటు BDకి అనంతరం ODకి తగ్గించడం జరిగింది. 2020 ఏప్రిల్ 16 నాటికి ఆమెకు పూర్తి సౌకర్యవంతంగా ఉండటంతో రెమిడీ తీసుకోవడం ఆపివేశారు.
2020, జూలై నాటికి వ్యాధి లక్షణాలు ఏమి పునరావృతం కాలేదు ఆమె తన జీవన నాణ్యత కూడా పెరిగినందుకు ఎంతో ఆనందిస్తున్నారు.