హెచ్.ఐ.వి 11975...India
55 ఏళ్ల మహిళ వ్యాధితో మంచం పట్టి ఆమె శరీర బరువు నాలుగునెలల్లో ఆమె సాధారణ బరువు 80 కిలోల నుండి 40 కిలోలకు తగ్గిపోయింది. 2000 నవంబర్ 25 వ తేదీన ఆమెకు దగ్గు, అధిక జ్వరం, మరియు తీవ్రమైన బలహీనత కారణంగా కదలలేని స్థితిలో ఉన్నందున ఆమెను ఆమె సోదరుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారించబడింది. ఆమె CD4* కౌంట్ కేవలం 77 మాత్రమే ఉంది. ఆమెకు ఈ జబ్బు 2016 నవంబర్ 6న హెచ్ఐవితో మరణించిన తన భర్త నుండి సంక్రమించింది. ఆసుపత్రిలో ఆమెకు యాంటీ బయోటిక్స్ తో చికిత్స చేయడం వలన ఆమెకు జ్వరము మరియు దగ్గు తగ్గింది కానీ తనకు హెచ్ఐవి పాజిటివ్ అనే వార్త ఆమెను చిన్నాభిన్నం చేసింది. మందులు వాడుతున్నప్పటికీ ఆమె ప్రతి రెండవ వారంలోనూ వాంతులు, విరోచనాలు, నోటిలో పుండ్లు,ఫ్లూ మరియు గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండేది. నిరాశతో ఆమె మందులు తీసుకోవడం ఆపివేసి ఎవరైనా ఆమె జబ్బును గురించి తెలుసుకుంటారేమో అనే అనుమానంతో అన్నీ మందులు పారవేసి రిపోర్టులను కూడా చించి వేసారు. రోగి సోదరుడు తన భార్య వంధ్యత్వానికి విజయవంతంగా చికిత్స పొంది ఉన్నందున వైబ్రియానిక్స్ పై పూర్తి నమ్మకం ఉంది. పూర్తి గోప్యత మరియు భరోసాతో చివరకు ప్రాక్టీషనర్ని తాను వ్యక్తిగతంగా సందర్శించననే షరతు మీద వైబ్రోరెమిడీ తీసుకోవడానికి రోగి అంగీకరించారు.
2017 జనవరి 16 వ తేదీన సోదరుడు ఆమె కోసం క్రింది రెమిడి తీసుకున్నారు :
CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.3 AIDS - HIV + CC15.1 Mental & Emotional tonic…6TD
15 రోజుల్లో రోగి బలం పొందడం ప్రారంభించి ఇంటి చుట్టూ నడవగలుగుతున్నారు. ఆమె దగ్గరి బంధువు ఒకరు ఆమెకు పూర్తి విశ్వాసం ఉన్న ఒక వైద్యుడు వైబ్రియానిక్స్ ప్రభావాన్ని చూడటానికి మరియు ఆమె ఆశలను సజీవంగా ఉంచడానికి CD4 లెక్కింపు కోసం క్రమం తప్పకుండా పరీక్షించసాగారు.
నెమ్మదిగా ఆమె అన్ని లక్షణాల నుండి మెరుగుపడసాగింది. 2018 అక్టోబర్ లో ఆమెకు ఉపశమనం కోసం ఆమె డాక్టర్ బంధువు ఆమె CD 4 కౌంట్ 200 లోపు ఉన్నప్పటికీ మునుపటి కంటే బాగా మెరుగు పడిందని చెప్పారు. 2019 జనవరి నాటికి ఆమెకు CD 4 కౌంట్ 200 పైగా పెరిగి ఆమె అన్ని లక్షణాల నుండి విముక్తి పొంది ప్రమాద స్థాయి నుండి బయట పడ్డారు. ఆమె బరువు 69 కిలోల వరకు పెరిగింది, ఇక అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. జనవరి 2020 నాటికి ఆమె పూర్తి సాధారణ స్థితికి చేరింది. 2020 మార్చి 20 నాటికి ఆమె CD 4 కౌంట్ 375 కి చేరడంతో ఆమెకు 100% ఉపశమనం కలిగింది. ఐతే ఆమె మోతాదు తగ్గించడానికి ఇష్టపడలేదు. అప్పుడప్పుడు ఆమె ప్రాక్టీషనర్ తో కృతజ్ఞతలు తెలపడం కోసం మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆమెను కలవడానికి లేదా తన ఆరోగ్యం గురించి ప్రశ్నించడానికి ఇంకా సిద్ధంగా లేదు. ఆమె సోదరుడు ప్రతీ నెలా ప్రాక్టీషనర్ నుండి రెమిడీలు తీసుకుంటూనే ఉన్నారు. జాతీయ లాక్ డౌన్ కారణంగా ఆమె జూన్ 2020లో చేయించుకోవలసిన పరీక్షకు వెళ్లలేకపోయింది కానీ ఆమె తన సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ శక్తివంతంగానూ, ఆత్మవిశ్వాసం తోనూ జీవిస్తున్నట్లు ఆమె సోదరుడు ధ్రువీకరించారు.
* CD4 కౌంట్ అనేది ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క రక్తంలో CD 4 కౌంటు 500 నుండి 1200cells/mm3 వరకు ఉంటుంది. CD4 కౌంటు ఏ వ్యక్తి కైనా 200 కన్నా తక్కువ ఉంటే ఆ వ్యక్తి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్ష చేయించు కోవలసి ఉంటుంది.