వంధ్యత్వము 11975...India
2018 మే 17 వ తేదీన 32-సంవత్సరముల మహిళ మరియు ఆమె 35 ఏళ్ల భర్త వివాహం చేసుకున్న గత ఎనిమిది సంవత్సరాలుగా సంతానలేమితో బాధపడుతూ ప్రాక్టీషనర్ని సందర్శించారు. భార్యకు 20 సంవత్సరాల వయసులో క్రమరహిత రుతుచక్రం ప్రారంభమై మొదట రెండు మూడు నెలలకు ఒకసారి ఇది క్రమంగా సంవత్సరానికి ఒకసారి ఏర్పడ సాగింది. నాలుగేళ్ల క్రితం వారి వైద్యుడిని సంప్రదించగా భార్యకు PCOD క్రమ రహిత ఋతు సమస్య మరియు భర్తకు వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరిద్దరూ వైద్యులు సూచించిన మందులను నాలుగు సంవత్సరాలు వాడినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. సంవత్సరం క్రితం 2017లో భర్త రోజంతా అలసటతో ఉంటున్నందున తనను తాను తనిఖీ చేయించుకోగా హైపో థైరాయిడ్ (TSH 12 mlU/L ఉంది దీని సాధారణ స్థాయి 0.4 నుండి 4.0మాత్రమే) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతను ఏ ఇతర ఔషధములు తీసుకోక ప్రత్యామ్నాయ ఔషధం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత అతను వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు అతని 12 ఉంది. వీరికి క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి.
భార్యకు :
#1. CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD
భర్తకు:
#2. CC6.2 Hypothyroid + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic…6TD
మూడు రోజుల్లో భార్యకు (సంవత్సర విరామం తర్వాత) నెలసరి వచ్చింది ఇది తరువాత రెండు నెలలు క్రమం తప్పకుండా వచ్చింది. ఆ తరువాత ఈ జంట సురక్షితమైన గర్భధారణ కోసం ప్రాక్టీషనర్ని సందర్శించారు. కనుక #1 స్థానంలో క్రింది రెమిడి ఇవ్వబడింది:
#3. CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…QDS
భర్తకు రెమిడీ తీసుకున్న నెలలోపే థైరాయిడ్ సాధారణ స్థాయికి (TSH 3 mlU/L) చేరడం, శక్తి స్థాయిలో మెరుగుదల ఏర్పడినందువలన #2 యొక్క మోతాదు QDSకు తగ్గించబడింది.
2018 ఆగష్టు నెలలో భార్య గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయ్యి 2019 ఏప్రిల్ 15 న చక్కని శిశువుకు జన్మ నిచ్చింది. కనుక రెండు నెలల తరువాత #3ను ఆపివేసారు. భర్తకు TSH సాధారణ స్థాయిలోనే కొనసాగడంతో #2 క్రమంగా తగ్గిస్తూ 2020 జూన్ 20 న ఆపివేసారు. భార్య ప్రాక్టీషనర్తో సన్నిహితంగా ఉంటూ ప్రస్తుతం జుట్టు రాలడం తగ్గడం కోసం రెమిడీ వాడుతున్నది.