పాపులర్ యుర్టికేరియా (దద్దుర్లు) 03552...UAE
37 ఏళ్ల గర్భిణీ స్త్రీ కి చేతులు కాళ్ళు ఉదరం మీద దురద ఏర్పడింది. ఆమె ఆరు నెలల గర్భవతి మరియు మూడు వారాల క్రితం పాపులర్ యుర్టికేరియా ఏర్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ రోగికి కార్టికో స్టెరాయిడ్ స్కిన్ క్రీమ్ ను సూచించారు. కానీ దానిని వాడడానికి ఆమె ఇష్టపడలేదు. అందువల్ల ఆమె వేప, ఆలోవీరా జెల్, మరియు ఓట్ మీల్ స్నానం వంటి మూలికా చికిత్సను ఆశ్రయించింది, అయితే ఇవి పెద్దగా ప్రభావం చూపలేదు. 2016 జులై 18 న ఆమె ప్రాక్టీషనర్ని సందర్శించగా ఆమెకు క్రిండి రెమిడీ ఇవ్వబడింది:
#1. CC13.1 Kidney & Bladder tonic + CC21.3 Skin allergies…TDS & మరియు నీటితో బాహ్య అనువర్తనం కోసం…BD, ఉదయం మరియు సాయంత్రం స్నానం తర్వాత మరియు సాయంత్రం నిద్రించే ముందు
#2. CC8.2 Pregnancy tonic…TDS
మరుసటి రోజు, చేతులు మరియు కాళ్ళు పై దురద తీవ్రతరం అయింది కానీ రోగి TDS గా రెమెడీలు తీసుకోవడం కొనసాగించారు. రెండు రోజుల తర్వాత తీవ్రత తగ్గింది మరియు ఆ వారంలోనే చేతులు మరియు ఉదరం మీద దురద 90% మెరుగు కాగా ఆమె పాదము మీద 50% తగ్గింది.
2016 ఆగస్టు 7 నాటికి, అనగా మూడు వారాల ముగిసే సమయానికి దురద పూర్తిగా నిష్క్రమించింది. అంతేకాక గతంలో సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న చోట వచ్చే నొప్పి కూడా మాయమైందని గమనించిన రోగి ఎంతో ఆనందించింది. #1 యొక్క మోతాదు వారం వరకూ BD కి మరియు తరువాత నెల వరకూ OD గా, సెప్టెంబర్ 15న ఆపివేసేంత వరకూ కొనసాగించింది. #2 మాత్రం డెలివరీ వరకు కొనసాగించవలసిందిగా సూచించారు. 2016లో అక్టోబర్ లో, ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. 2019 లో చివరిసారిగా ఆమె ప్రాక్టీషనర్ని సంప్రదించినప్పుడు దురద పునరావృతం కాలేదని తెలిపారు.