మలబద్ధకం 11614...India
61 ఏళ్ల మహిళ రోజుకు రెండు లీటర్ల నీరు, పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల ఆహారం తీసుకున్నప్పటికీ గత ఐదేళ్లుగా మలబద్ధకంతో బాధపడుతూ ఉంది. రెండు రోజుల కొకసారి ఆమె విరోచనకారి తీసుకుంటే తప్ప ఆమె విరోచనం కావడం చాలా కష్టం. మూడు నెలల క్రితం ఆమె పరిస్థితి చాలా ఘోరంగా మారి ప్రతీరోజూ విరోచనకారిని తీసుకుంటున్నప్పటికీ కూడా మూడు రోజులకు ఒకసారి మాత్రమే మలవిసర్జన చేయగలుగుతోంది అదికూడా చాలా కష్టంతో. 2019 సెప్టెంబర్ 7న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.1 Digestion tonic...TDS
వారం తర్వాత రోగి తనకు 30 నుండి 40 శాతం ఉపశమనం కలిగిందని, ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి తక్కువ కష్టంతో మలవిసర్జనకు వెళ్తున్నట్లు ఆమె తెలిపింది. మరొక వారం తర్వాత ఆమెకు 100% ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఆమె ప్రతీరోజూ సునాయాసంగా మలవిసర్జన చేయగలుగుతోంది. 2019 అక్టోబర్ 4న, మూడు రోజుల క్రితమే విరోచనకారి మందులు తీసుకోవడం కూడా ఆపేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఆమె ప్రేగు కదలికలు సాధారణ స్థాయిలో ఉన్నట్టు ఐదు సంవత్సరాల బాధకు విముక్తి లభించినట్లు ఆమె తెలిపారు. మోతాదును OD కి తగ్గించి, క్రమంగా అక్టోబర్ 23 నాటికి OW కి తగ్గించబడింది. 2019 అక్టోబర్ 28న, నాటికి ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో దాని అవసరంలేదని భావించినందువలన ఆమె తనంతట తానే రెమిడీ తీసుకోవడం ఆపివేసింది. 2020 ఏప్రిల్ నాటికి, ఆమెకు ఎటువంటి లక్షణాలను పునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉన్నది.