ఆమ్లత్వము 12013...India
సీనియర్ మేనేజ్మెంట్ పోస్ట్ లో ఉన్న 62 ఏళ్ల వ్యక్తి 2006లో ఎక్కువ బాధ్యత వహించే పదవికి పదోన్నతిపై వెళ్లారు. ఇది అతనికి చాలా ఒత్తిడి తెచ్చిపెట్టింది దీంతో అతను ఆసిడ్ రిఫ్లెక్స్, అపాన వాయువు, మరియు పుల్లని రుచితో త్రేన్పులు, భోజనం చేసిన ప్రతిసారీ ముఖ్యంగా అల్పాహారం తర్వాత అభివృద్ధి అయ్యాయి. అలాగే ఉదయం పూట మలవిసర్జన ఒకటికి బదులు రోజుకు రెండు మూడు సార్లకు చేరుకుంది. 2007 ప్రారంభంలో అతని వైద్యుడు పాన్టోసిడ్ మాత్రలను రోజుకు ఒకసారి తీసుకోవాలని సూచించారు. మరియు అతను దీన్ని 2011 వరకు ఐదు సంవత్సరాలు కొనసాగించారు. ఇది అతనికి మంచి ఉపశమనం కలిగించింది. అయితే పై లక్షణాలన్నీ వారానికి రెండు మూడు రోజులు అనుభవించవలసి వచ్చేది. 2010లో పదవీ విరమణ చేసిన తర్వాత కార్యాలయ వత్తిడి పోయింది కానీ అతను అనేక సేవా కార్యకలాపాలలో ప్రధాన పాత్ర పోషించడం వలన బిజీగా ఉండడంతో అతను ఇంకా ఒత్తిడికి గురయ్యారు. అతను వేరే మార్గం లేదని భావించి నందువలన అతని అల్లోపతీ మాత్రల పైననే ఆధారపడ్డారు. 2011లో వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్గా మారిన అతను తనను తాను చికిత్స చేసుకునే అవకాశాన్ని కలిగి నవంబర్ 8న అతను ఈ క్రింది రెమిడీ తీసుకోవడం ప్రారంభించారు :
CC4.1 Digestion tonic + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic…QDS
మూడు నెలల్లో అతను త్రేన్పుల నుండి విముక్తి పొందారు. అతని ఫ్రేగు(మల విసర్జన) కదలికలు సాధారణమయ్యాయి మరియు యాసిడ్ రిఫ్లెక్స్, అపానవాయువు 70 శాతం తగ్గాయి. కాబట్టి 2012 ఫిబ్రవరి 15న అతను పాంటోసిడ్ తీసుకోవడం రెండు రోజులకు ఒకసారి మరియు మార్చి 21 నాటికి వారానికి రెండు సార్లు తగ్గించారు. వైబ్రియానిక్స్ అదే మోతాదులో కొనసాగించారు. జూలై ఒకటి నాటికి అతను అన్ని లక్షణాల నుండి 100% ఉపశమనం పొందడంతో అతను ప్యాంటోసిడ్ తీసుకోవడం మానేసారు. మరియు అతని మోతాదును TDS కు తగ్గించారు. రెండున్నర నెలల తర్వాత లక్షణాలు ఏవి పునరావృతం కానందున మోతాదు OD కి తగ్గించి ఆపివేసారు. 2012 నవంబర్ 15 నాటికి లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదు.