భయభ్రాంతుల నుండి విముక్తి 11601...India
11 ఏళ్ళ బాలికకు కాళ్ళు, ముఖ్యంగా తొడలు మరియు ఉదరం మధ్యలో భరించలేని నొప్పి వస్తూ ఉండడంతో గత మూడు వారాలుగా ఆమె పాఠశాలకు కూడా వెళ్లలేక పోయింది. యుక్తవయస్సు ప్రారంభం కావడం వలన ఇటువంటి లక్షణాలు తలెత్తాఏమో అనే భావనతో, ఆమె తల్లిదండ్రులు ఒక వైద్యుడిని సంప్రదించారు, అతడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు ఇచ్చిన అల్లోపతి మందులు ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. దీంతో 2018 ఆగస్టు 3న తల్లిదండ్రులు పాపను చికిత్సా నిపుణుని వద్దకు తీసుకొని వచ్చారు.
సంప్రదింపుల సమయములో, అభ్యాసకుడి ప్రేమపూర్వక వైఖరి కారణంగా ఆ పాప నోరు తెరిచి మూడు వారాల క్రితం తనకు ఒక కల వచ్చిందని, దాని లో తెల్ల చీర ధరించిన ఒక మహిళ తన ముఖం మరియు తలపై గట్టిగా కొట్టి అదృశ్యమైందని చెప్పింది. మరుసటి రోజు ఉదయం నుండి, ఆమెకు భరింపరాని నొప్పి వచ్చి ఏడుస్తూ ఎంతో భయపడి పోయి రాత్రిపూట తన తల్లి కూడా తనతో పడుకోవాలని కోరుకుంది. ఇది విని పాప తల్లిదండ్రులు దీని గురించి తమకు ఏమీ తెలియనందుకు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ విధంగా వారు చర్చిస్తున్న సందర్భంలో వీరి ఇంటికి రెండిళ్ళ అవతల ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం బయటకు వచ్చింది. పాప యొక్క సమస్యకు కారణాలు గుర్తించి అభ్యాసకుడు ఈ క్రింది నివారణ ఇచ్చారు:
CC3.7 Circulation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue … ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున గంట వరకూ అనంతరం 6TD
ఆమె తల్లిదండ్రులు పాపకు అల్లోపతి మందులు ఇవ్వడం మానేశారు. మూడు రోజుల తర్వాత, ఆగస్టు 6నాటికి, పాప యొక్క లక్షణాలలో 50% మెరుగుదల కనిపించి, ఆ పాప పాఠశాలకు తిరిగి వెళ్ళడం ప్రారంభించింది. మోతాదును TDSకు తగ్గించారు. ఒక వారం తర్వాత, ఆగస్టు 13న, నివారణ వలన పాపకు పుల్లౌట్ రావడంతో ఆమె చేతులు మరియు ముఖం మీద దద్దుర్లు వ్యాపించాయి. అయితే నివారణను యధావిధిగా కొనసాగించవలసిందిగా చికిత్సా నిపుణుడు సూచించారు. ఆగస్టు 20 నాటికి, ఆ పాప తన కాళ్ళలో అలాగే కడుపులో కూడా నొప్పిలేదని దద్దుర్లు కూడా దాదాపు తగ్గిపోయాయని చెప్పింది.
2018 ఆగస్టు 27న పాప తండ్రి తన పాపకు అన్ని లక్షణాలు నుండి పూర్తిగా ఉపశమనం లభించిందని; క్రమం తప్పకుండా పాఠశాలకు వెడుతూ పరీక్షల నిమిత్తం చక్కగా చదువుకుంటోందని తెలియజేశారు. మాత్రలు ఇచ్చిన డబ్బా ఖాళీ కాగానే తల్లిదండ్రులు తిరిగి చికిత్స నిపుణుడిని సందర్శించాలనే అవసరం లేదని అనుకున్నారు. 2020 ఫిబ్రవరి 15 నాటికి చికిత్స నిపుణునికి పాప తండ్రి కృతజ్ఞతలు తెలపడానికి ఫోన్ చేసినప్పుడు పాప పూర్తిగా సాధారణ స్థితికి చేరుకొని ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు.
సంపాదకుని సూచన: అభ్యాసకుడు అవకాశం తీసుకోవడానికి ఇష్టపడక ఒకేసారి రోగ లక్షణాలకు మరియు రోగ కారణానికి చికిత్స చేయడాన్ని అభినందిస్తున్నాము. కారణం తెలియడంతో, CC12.2 Child tonic + CC15.2 Psychiatric disorders తో కూడా రోగ నివారణ చేయవచ్చు.