ఆమ్లత్వము, ఆహారపు అలెర్జీ 11618...India
58-సంవత్సరాల మహిళ గత ఎనిమిది సంవత్సరాలుగా కడుపు నొప్పి మరియు ఆమ్లత్వం తో బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఆమె బఠానీ లేదా మషాలాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఈ బాధకలుగుతోంది. అల్లోపతి మందులు ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందించాయి. అవి ఆపిన వెంటనే రోగ లక్షణాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఆమె సాధారణంగా మషాలాలు, బఠానీలకు దూరంగా ఉండ సాగారు. 2019 ఆగస్టు నెలలో తిరిగి ఇబ్బంది ప్రారంభమైనప్పుడు ఆమె అల్లోపతి మందులు తీసుకోకుండా, మూడు రోజుల తర్వాత, వైబ్రియానిక్స్ చికిత్స తీసుకున్నారు.
2019 ఆగస్టు 13న ఆమెకు క్రింద నివారణ ఇవ్వబడింది:
CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD
3వ రోజు నాటికి, 60% ఉపశమనం పొందారు. మరొక వారం తర్వాత కడుపు ఉబ్బరం మరియు గ్యాస్టిక్ నొప్పి నుండి 80% ఉపశమనం పొందారు. దీంతో ఆగస్టు 23న మోతాదును TDS కి తగ్గించబడింది. 2019 ఆగస్టు 30న రోగికి 100% ఉపశమనం కలగడంతో, మోతాదును ODకి తగ్గించి 2019 సెప్టెంబర్ 10 నుండి పూర్తిగా ఆపివేశారు. చికిత్స ప్రారంభించిన తర్వాత క్రమంగా బఠానీ మరియు మషాలాలు ఆహారంలో తీసుకోవడం ప్రారంభించారు అయితే ఆమెకు ఎప్పుడూ ఈ సమస్య రాలేదు. 2020 జనవరి నాటికి, లక్షణాలు ఏమీ పునరావృతం కాలేదు..