కాలి మీద బాధాకరమైన వ్రణము 01001...India
అభ్యాసకురాలి 49 సంవత్సరాల వయస్సు గల భర్తకు కాలి మీద ఎర్రబడిన పుండు ఉండేది. ఇది 15 రోజులుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అది చూడటానికి చిన్న బంతి లాగా ఉండి చీము ఉంది.
2019 ఫిబ్రవరి 2న క్రింది రెమిడీ ఇవ్వబడింది:
NM16 Drawing…6TD లోపలికి తీసుకొనడానికి మరియు బాహ్యంగా ఆలివ్ ఆయిల్లో మొదటి రోజు మాత్రమే రాయడానికి BD
మొదటి రోజు రెండవ మోతాదు తీసుకునేటప్పుడు రోగికి ఎంతో ఉపశమనం కలిగింది. అతనిని ఆశ్చర్యానికి గురిచేస్తూ పుండు అదృశ్యమై, కేవలం ఒక సన్నని రంధ్రం మాత్రం ఉంది. తన పాంటు లో కొంత భాగం తడిగా ఉండటం చూసి చీము విడుదలైందని తెలుసుకున్నారు. మరుసటి రోజు చర్మం చక్కగా అక్కడ అసలు ఏమీ లేనట్టుగా ఉంది. మోతాదు మూడు రోజులుTDS గా అనంతరం రెండు రోజులు ODకి తగ్గించి 2019 ఫిబ్రవరి 7న ఆపివేయబడింది. ఫిబ్రవరి 2020 నాటికి రోగ లక్షణాలు పునరావృతం కాకుండా చక్కగా ఉంది.
108CC బాక్స్ ఉపయోగించే వారు : CC21.11 Wounds & Abrasions ఇవ్వవచ్చు.