Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

వంధ్యత్వము 11476...India


33 సంవత్సరాల వయస్సు గల ఒక తల్లి గత ఎనిమిది సంవత్సరాల నుండి గర్భ ధారణకోసం ఆలోపతి మందులు వాడినా గర్భం ధరించి లేకపోయింది. అక్టోబర్ 2011 లో ఆమె అభ్యాసకుడు వద్దకు వచ్చినప్పుడు ఆమె ఉద్రిక్తంగా మరియు ఆందోళనగా ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఆమె మధుమేహానికి, మూడు సంవత్సరాలుగా హైపోథైరాయిడ్ కి మందులు తీసుకుంటున్నారు.  ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:  

  #1. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus...TDS

ఆమె పదిరోజుల్లోనే గర్భం దాల్చింది. ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా తన పిల్లల బాధ్యత గురించి భయపడుతున్నందున ఆమెకు మద్దతు ఇవ్వడానికి అభ్యాసకుడు ఆమెతో ఫోన్ లో క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఉండేవారు. ఆమెకు రెమిడీ క్రింది విధముగ మార్చబడింది :

#2. CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC8.2 Pregnancy tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

ఆమె గర్భధారణ సమయంలో మరియు తర్వాత ఒక నెలవరకు ఈ కాంబోలు తీసుకుంది. రక్తంలో చక్కెర మరియు థైరాయిడ్ స్థాయిలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఆమె అల్లోపతి మందులు తీసుకోవడం కొనసాగించారు. ఐదవ నెలలో ఆమె మధుమేహం కోసం ఇన్సులిన్ పంపు నుండి ఇంజక్షన్లు తీసుకొనడం కొనసాగించింది. ఆగస్టు 10వ తేదీన డెలివరీ కావాల్సి ఉన్నప్పటికీ ఆమె C సెక్షన్ ద్వారా 2012 జూలై 17న బేబీని ప్రసవించింది. ఆ బేబీ 2.7 కేజీలు బరువు ఉంది. ప్రస్తుతం బేబీ వయసు ఐదు నెలలు. ఆమె తల్లికి మధుమేహం లేదు. థైరాయిడ్ సమస్య స్థిరంగా ఉంది. ఆమె థైరాయిడ్ మందు 50 ఎంజి నుండి 25 ఎం.జి కి తగ్గించారు. ఆమె శిశువు పూర్తిగా తల్లిపాలమీదే ఆధారపడి ఉంది.  

సాయిరాం పోటెన్టైజర్ ఉపయోగిస్తూ ఉంటే క్రింది రెమిడీ ఇవ్వండి: వంధత్వము కోసం : OM24 Female Genital + BR8 Stress + BR16 Female + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM4 Stabilising + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR261 Nat Mur 200C + SR313 Sepia 200C + SR398 Nat Carb + SR515 Ovary + SR537 Uterus.

మధుమేహం కోసం: NM74 Diabetes + BR2 Blood Sugar + SM17 Diabetes + SR516 Pancreas.

థైరాయిడ్ కోసం: SR225 Throat Chakra + SR230 Moonstone + SR261 Nat Mur + SR280 Calc Carb 30C + SR308 Pituitary Gland + SR319 Thyroid Gland + SR320 Thyroidinum + SR568 Hypothyroidism