ఋతుక్రమంలో అధిక రక్తస్రావం (మెనోరేజియా) 12051...India
13 సంవత్సరాల బాలికకు, 2018 ఏప్రిల్ 19 వ తేదీ రజస్వల అయినప్పటినుండీ వారం రోజుల పాటు ఋతుక్రమంలో అధిక రక్తస్రావం అవుతోంది. ఆ తరువాత ఐదు వారాల్లో ఆమెకు మరో రెండు సార్లు ఋతుక్రమంలో అధిక రక్తస్రావం అయింది. ఆమె తల్లి అభ్యాసకురాలు అయినందున 2018 మే 3 న క్రింది రెమెడీ ఇచ్చారు:
#1. CC8.7 Menses frequent + CC15.1 Mental and Emotional Tonic...QDS
పెద్దగా మార్పు లేకుండానే 6 వారాల్లో ఋతుక్రమంలో మరో 2 సార్లు అధిక రక్తస్రావం అయింది. ప్రారంభ దశలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికి, వైబ్రియనిక్స్ రెమెడీతోనే సమస్య పరిష్కారమవుతుందని తల్లి నమ్మకంగా ఉంది. అభ్యాసకురాలి కుమార్తెకు నెలసరి ఇంకా 3 వారాల వ్యవధి ఉన్నప్పుడు ఆమె 2018 ఆగష్టు 14 న గైనకాలజిస్ట్ ను సంప్రదించారు. గైనకాలజిస్ట్ సూచించిన అల్లోపతి మందులు 2 రోజుల్లో అధిక రక్తస్రావాన్ని తగ్గించినప్పటికీ, రక్తస్రావం మరో 12 రోజులు పాటు కొనసాగింది. ఆ పరిస్థితిలో ఆమె పాఠశాలకు వెళ్లడం కష్టంగా ఉండటంతో ఇది రోగికి విసుగు కలిగించింది. వైద్యుడు ఆమెకి హార్మోన్ల చికిత్సను సూచించారు, కానీ ఆమె తల్లి అల్లోపతి మందులను కొనసాగించడానికి ఇష్టపడలేదు.
బదులుగా 2018 సెప్టెంబర్ 17న సీనియర్ ప్రాక్టీషనర్10375 సంప్రదించారు. #1 స్థానంలో ఈ క్రింది రెమెడీ ఇవ్వబడినది:
#2. NM6 Calming + NM56 Menses Bleeding + BR16 Female + SR256 Ferrum Phos + SR537 Uterus…TDS
3 రోజుల తరువాత, ఆమె ఋతుక్రమం ప్రారంభమైంది (ఇది ఆమె మునుపటి ఋతుక్రమానికి సరిగ్గా 3 వారాలు తర్వాత), మరియు సాధారణ రక్తస్రావం తో 10 రోజులు కొనసాగింది. తరువాతి మూడు ఋతుక్రమాలు సాధారణ రక్తస్రావంతో 7 రోజులు పాటు అక్టోబర్ నుండి క్రమం తప్పకుండా కొనసాగాయి. జనవరి 19 నుండి ఋతుక్రమంలో రక్తస్రావం కాల వ్యవధి 4-5 రోజులకు తగ్గి స్థిరంగా ఉంది. 7 నెలల తరువాత 2019 ఏప్రిల్ 29 న మోతాదు OD కి తగ్గించబడింది, తరువాత 2019 జూలై 1 నుండి పూర్తిగా ఆపివేసే వరకూ మోతాదు క్రమంగా తగ్గించబడింది. 2019 అగష్టు 19 నాటికి, రోగి తన ఋతుసమస్యల పునరావృతం లేకుండా 100% బయటపడింది.