Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ (అల్సరేటివ్ కొలైటీస్), బ్రక్సిజం 03558...France


53 ఏళ్ల వ్యక్తి గత 11 సంవత్సరాలుగా కడుపునొప్పి, శ్లేష్మం మరియు రక్తంతో కూడిన విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు.  వికారం మరియు వాంతితో పాటు భోజనం చేసిన వెంటనే అతనికి విరోచనం ఆపుకొనలేని పరిస్థితి  ఉండేది.  దీని ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. ఇది 2006 లో వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథగా )అల్సరేటివ్ కొలైటీస్) నిర్ధారించబడింది. 2 సంవత్సరాలు పాటు పెంటాసా సుపోజిటరీస్ తీసుకొన్నారు, అయినా ఇది  అతనికి ఉపశమనం కలిగించలేదు.  తరువాత 3 సంవత్సరాల పాటు, అతను రక్తస్రావం, రెక్టో-కొలిటిస్ కోసం చికిత్స పొందాడు. దీనివలన ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. పైగా  అతను 15 కిలోల బరువును కోల్పోయాడు. దీనితో అతనిని ప్రతి 8 వారాలకు ఒకసారి రెమికేడ్ 400 mg డ్రిప్ మీద ఉంచారు.  అతనికి 2 సంవత్సరాలు పాటు కార్టికోస్టెరాయిడ్ కూడా ఇచ్చి 2013 లో ఆపివేశారు. ఆరోగ్యం బాగోనందున, అతను 2014 లో ఉద్యోగం కోల్పోయి  మానసిక వత్తిడికి గురయ్యాడు. 2017 అక్టోబర్ 15న, అతను అభ్యాసకుడిని కలిసినప్పుడు, అతని గత 2 సంవత్సరాల లక్షణాలు కడుపు నొప్పితో పురీషనాళం యొక్క వాపు, మలంలో రక్తంతో రోజుకు 3 సార్లు విరేచనాలు మరియు తీవ్రమైన నిరాశ, గత 15 సంవత్సరాలుగా తనకు బ్రక్సిజం (నిద్రలో పళ్ళు కొరికే అలవాటు) ఉందని రోగి వెల్లడించాడు, ఐతే దీనికి అతను ఎప్పుడూ చికిత్స తీసుకోలేదు. అభ్యాసకుడు అతనికి ఈ క్రింది రెమెడీ ఇచ్చాడు:

వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ మరియు బ్రక్సిజం కోసం: 

#1. CC 4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders… ప్రతి పది నిమిషాలకు ఒక మోతాదుచొప్పున 2 గంటల పాటు  తరువాత 3 రోజులు 6TD, తరువాత TDS

అతను క్రమబద్ధమైన రెమికేడ్ డ్రిప్స్ కాకుండా ఏ ఇతర చికిత్స తీసుకోలేదు. అతను నివారణ తీసుకున్న రోజునే, సాయంత్రం తీవ్రమైన తలనొప్పి వచ్చింది, ఇది ఒక వారం పాటు కొనసాగింది. పుల్లౌట్ ఉన్నప్పటికీ, అతను తన సమస్యలనుండి త్వరగా ఉపశమనం పొందడానికి  సూచించిన మోతాదును కొనసాగించాడు.

మూడు వారాల తరువాత 2017 నవంబర్  8 న, అతని విరోచినాల సంఖ్య రోజుకు ఒకసారికి తగ్గింది, మరియు నొప్పి మరియు మంటతో పాటు మలంలో రక్తం రావడం సగానికి తగ్గింది. ఇక అతను విరోచినం ఆపుకొనలేని స్థితి, వికారం లేదా వాంతి పూర్తిగా అదృశ్య మయ్యాయి. అలాగే, దవడలలో కొంత భాద ఉన్నప్పటికీ అతను రాత్రి పూట పళ్ళు కొరకడం మానేశాడు. తరువాతి 2 నెలల్లో, పెద్దప్రేగు శోథకు సంబంధించి అతని ఆరోగ్యం మెరుగుపడిందని గమనించి, డ్రిప్స్ ని అతని వైద్యుడు ఆపాడు, ఇతరత్రా  మందులు కూడా  సూచించలేదు. అతనికి క్రమబద్ధమైన  ఉద్యోగం లేనందున, చేస్తున్న పనిలో వత్తిడి కలిగినప్పుడల్లా  రాత్రి పళ్ళు కొరికే అతని అలవాటు తిరిగి కనిపించసాగింది.

2018  జనవారి 8 న రెమెడీ #1 క్రిందివిధంగా సవరించ బడింది:

# 2. CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC20.4 Muscles & Supportive tissue...TDS 

బ్రక్సిజం కారణంగా అతని నిద్ర చెదిరిపోతే, ఈక్రింద రెమెడీ # 3 ని  అదనంగా రాత్రిపూట తీసుకునేందుకు సహాయకారిగా  ఇవ్వబడింది:

# 3. CC15.2 Psychiatric disorders + CC20.4 Muscles & Supportive tissue  ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున పళ్లుకొరకడం ఆపేవరకూ తీసుకోవాలి.

తరువాతి 2 నెలల్లో, రోగి కడుపులో నొప్పి మరియు మంట లేకుండా పోయాయి.  రక్తం లేదా శ్లేష్మం పడడం కూడా తగ్గిపోయి విరోచినాల సంఖ్య రోజుకు ఒక్కసారి చొప్పున స్థిరంగా ఉండసాగింది. అతను రాత్రిళ్ళు పళ్ళు కొరకడం కూడా దాదాపు  మానేశాడు. ఐతే అతనికి  దవడలలో కొంచెం నొప్పిఉండేది కానీ అది కూడా  మోతాదు తీసుకున్న వెంటనే అదృశ్యమయ్యేది. వైబ్రియోనిక్స్ చికిత్స ప్రారంభించిన 5 నెలల తరువాత, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ యొక్క అన్ని లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. 2018 మార్చి 19 నాటికి #2 యొక్క మోతాదు BD కి తగ్గించబడింది.

3 నెలల తరువాత 2018  జూన్ 15న అతను 5 కిలోల బరువును తిరిగి పొందాడు. అంతేకాక తన అభిరుచి మేరకు సంతృప్తికరమైన ఉద్యోగం చూసుకొన్నాడు. ఇందులో  శారీరక శ్రమ అధికంగానే ఉన్నప్పటికీ పళ్ళు కొరుకుడు వంటి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు. ఇప్పుడు అతనికి ఆకలి బాగానే అవుతోంది, పోషక విలువలు ఉన్నఆహారాన్ని తీసుకుంటూ చక్కగా ప్రార్థన చేస్తూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. అతనికి లక్షణాలు ఏవీ పునరావృతం కానందున, #2 యొక్క మోతాదు OD కి తగ్గించబడింది #3 ఆపివేయబడింది.

2018  సెప్టెంబర్ 16న, రోగి యొక్క సౌలభ్యం ప్రకారం #2 మోతాదును OW కు తగ్గించమని సలహా ఇచ్చారు. 2019 ఆగష్టు లో అతనితో చివరిగా మాట్లాడినప్పుడు, వ్యాది లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు మరియు రోగి రెమెడీ #2 ని OW గా తీసుకుంటున్నాడు.