సూక్ష్మజాతి గులాబీ మొక్క శీతాకాలంలో వాడిపోవడం 03553...Canada
అభ్యాసకురాలి తోటలో ఉన్నసూక్ష్మజాతి గులాబీ మొక్కను ఎoతగా సంరక్షిస్తున్నా 2016 -17 శీతాకాలంలో చలిబాగా ఎక్కువగా ఉoడటం వల్ల వాడిపోయింది. వేసవి ప్రారంబమైన తర్వాత కూడా మొక్క కోలుకోలేదు. 2017 జూలై 3న, ఈ మొక్కపై ఆకులు చాలా తక్కువగా ఉన్నాయి, అది చాలా లేత మరియు పసుపు రంగులో ఉంది, ఈ క్రింది వైబ్రియోనిక్స్ మoదులు ప్రారంభించినప్పుడు మొక్క ఈ విధంగా ఉంది (చిత్రాలు చూడండి).
#1. CC1.2 Plant tonic + CC15.1 Mental & Emotional tonic...3TW
నీటిలో తయారు చేసుకున్న నివారణ మoదును అభ్యాసకుడు మొక్క యొక్క నేలలో పోయడంతో పాటు మొక్క ఆకుల మీద కూడా రోజు విడిచి రోజూ పిచికారీ చేసారు. క్రమoగా 2 నెలల కాలంలో ఆకులు చక్కగా పెరగడంతో పాటు 2017 సెప్టెంబర్ 23 న అందమైన గులాబీ వికసించింది (చిత్రాలు చూడండి). గతంతో పోలిస్తే ఆకుల పరిమాణం దాదాపు రెట్టింపు అవడంతో పాటు అవి ఆరోగ్యంగా కనిపిస్తున్నాయని అభ్యాసకురాలు గమనించారు. రెమెడీని అక్టోబర్ మధ్యలో శరదృతువులో నిలిపివేయడంతో పాటు రాబోయే శీతాకాలంలో మొక్కని రక్షిoచటానికి మొక్క పై పైన కత్తిరించబడింది (ట్రిమ్ చేయబడింది). 2017-18 శీతాకాలం తరువాత, మరల రెమెడీ # 1ని వాడటంవల్ల, వేసవిలో గులాబీ మొక్కను సంరక్షించడానికి సహాయపడింది. అంతేకాక మునుపటి వేసవికాలంలో మొక్క ఎలా ఉందో అలా వికసించిన గులాబీతో అందంగా ఉంది.