బలవoతoగా రోమాలు తినే పిల్లి 03553...Canada
సంరక్షణ కేంద్రం నుండి తీసుకు వచ్చిన అబ్బి అనే 8 ఏళ్ల పిల్లికి 2009 నవంబరులో, తన యజమాని దత్తత తీసుకున్న సమయం నుండి భయం భయంగా ఉంటోంది. అది 10 వారాల వయస్సులో ఉన్నపుడు సంరక్షణ కేంద్రంలో ఉన్నచిన్న పిల్లలు దానికి ఇబ్బoధి కలిగే విధoగ ప్రవర్తిoచేవారు. అది అతి స్వల్ప శబ్దంతో దూకేది, యజమానితో సన్నిహితంగా ఉండడానికి సంకోచించేది, తరచూ నిరాశతో తనవంటిపై ఉన్నరోమాలను తానే నమిలేది. తత్ఫలితంగా, తన శరీరంపై బట్టతల లాoటి ప్యాచెస్ వచ్చాయి, ఇవి దానికి చక్కగా గుండు చేసినట్లు కనిపిoచేవి.
అభ్యాసకునికి పిల్లి యజమాని బాగా తెలిసిన వారు కావడం మరియు వీరిరువురు తరుచూ కలుసుకొనడానికి దూరం ప్రధాన ప్రతిబంధకం అయినందున, 2017 జనవరి 18 న, నివారణ మoదులు సాధారణ పద్ధతికి విరుద్ధంగా అనగా గోళీలకు బదులు ఆల్కహాల్లో ఇచ్చారు:
#1. CC1.1 Animal tonic + CC15.1 Mental & Emotional tonic…పిల్లి త్రాగే 500ml నీటిలో ఒక చుక్క రెమెడీని వేసి ఇచ్చారు.
మొదటి 3 వారాలలో దాని ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేనప్పటికీ, రెమెడీను కొనసాగించారు. చికిత్సప్రారంభమైన ఐదు వారాల తరువాత, ఫిబ్రవరి 22 న, యజమాని అబ్బి వంటి మీద రోమాలు పెరగడం గమనించారు. అది యజమానితో సాన్నిహిత్యం పెంచుకొనడం ప్రారంభించింది. అంతేకాక దాదాపుగా యజమాని ఒడిలో పడుకోవడానికి ప్రయత్నించేది. కానీ తరువాత నెలలో, యజమానిని సందర్శించేందుకు వచ్చిన అతని మనవరాళ్లకు దగ్గర కాలేక భయంతో కుంచించుకు పోవడంతో, తన పాత లక్షణాలు పునరావృతం అయ్యాయి.
18 మార్చి 2017 న, ఇట్టి లోతైన భయాలను పోగొట్టడానికి, అభ్యాసకురాలు #1 ని ఈ క్రింది విధంగా మార్చిఇవ్వడమైనది:
#2. CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.2 Psychiatric disorders + #1
2 వారాల వరకు ప్రవర్తనలో ఎటువంటి మెరుగుదల లేనందున, మార్చి11 న #2 కు ప్రత్యామ్నాయంగా ఈ క్రింది రెమెడి ఇవ్వడమైనది:
#3. CC11.2 Hair problems + CC15.2 Psychiatric disorders + #1 పై రెమెడీ వలె నీటితో ఇవ్వడం మరియు బాహ్యంగా రాయడానికి కూడా విభూతితో కలిపి ఇవ్వబడింది.
3 వారాలు పాటు రెమెడీ # 3 ని ఉపయోగించిన తరువాత, వెంట్రుకలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. యజమాని తాగునీటిలో మాత్రమే రెమెడీను కొనసాగించారు, ఎoదువల్ల అoటే అబ్బి విభూతినీ నాలికతో నాకటంతో పాటు తన రోమాలను కూడ నమలడంతో విభూతిని వాడటం మానేశాడు. ఆ తరువాత, యజమాని నుoడి 7 నెలలు పాటు ఎటువoటి సమాచారoలేదు ఐతే రెమెడీలను మాత్రం ప్రతీ రోజూ ఇస్తున్నట్లు తెలిసింది. 2017 డిసెంబర్ 4 న యజమాని రీఫిల్ కోసం వచ్చి అబ్బి యొక్క రోమాలు పూర్తిగా పెరిగాయని, బట్టతల ప్యాచెస్స్ పెద్దగా ఏమీలేవని, అది వెంట్రుకలను నమలడం మానేసిందని, అయితే అపరిచితులు మరియు పిల్లలను చూసి కొంచం భయపడుతున్నప్పటికీ దానిలో నైరాశ్యం గణనీయంగా తగ్గిందని చెప్పాడు. అoదువలన, # 3 కి ప్రత్యామ్నాయంగా ఈ క్రింది రెమెడి ఇవ్వడమైనది:
#4. CC15.2 Psychiatric disorders + #1 2019 ఆగష్టు 28 నాటికి, రెమెడీ # 4 ఆపివేయబడింది, ఎందుకంటే అబ్బి శబ్దం లేదా వ్యక్తుల గురించి భయపడటoలేదు మరియు మిగతా లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు. అభ్యాసకుడు క్రింది రెమెడీ, గోళీల రూపంలోఇచ్చారు.
#5. CC1.1 Animal tonic + CC17.2 Cleansing...OD త్రాగునీటితో.
మోతాదు యజమాని యొక్క సౌకర్యం ప్రకారం క్రమంగా తగ్గించబడుతుంది.
సంపాదకుని వ్యాఖ్య: CC15.2 Psychiatric disorders లో CC15.1 Mental & Emotional tonic కలిసే ఉంటుంది కనుక దీనిని ప్రత్యేకంగా వేయవలసిన అవసరం లేదు. అభ్యాసకురాలు కొత్తగా వైబ్రో ప్రాక్టీస్ ప్రారంభించి నందున ఈ తప్పు జరిగి ఉండవచ్చు. రెమెడీను నేరుగా ఆల్కహాల్ లో ఇవ్వకుండా ఉండడం మంచిది.