మలేరియా అవశేషాలు అధిక లాలాజలం మరియు చెమట 03546...France
2014 లో పోషకాహార లోపంతో బాధపడుతూ కేవలం తొమ్మిది కేజీల బరువు మాత్రమే ఉన్న మూడేళ్ల పాప ఆఫ్రికాలో దత్తత తీసుకోబడి ఫ్రాన్స్ కు తీసుకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆమెకు మలేరియా ఉందని నిర్ధారణ కావడంతో నోటి ద్వారా వేసే క్వినైన్ మాత్రలతో మూడు నెలలు చికిత్స చేయగా జ్వరం మరియు తలనొప్పి నుండి ఉపశమనం లభించింది. కానీ ఆమె శరీరం ఎప్పుడు తాకినా వేడిగా ఉండడమే కాక ఆ పాప అధిక ఉష్ణోగ్రతను భరించలేక విలవిల లాడేది. ఆమెకు విపరీతమైన చెమటలు ఏర్పడుతూముక్కుతో శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది కలిగేది. ఆమె గొంతునుండి శ్వాస తీసుకునేటప్పుడు ఒక రకమైన ధ్వని వచ్చేది. ఆమె టాన్సిల్స్ కూడా విస్తరించాయి. రాత్రి సమయాల్లో ఆమె అధిక లాలాజలం ఉత్పత్తి చేయడంతో అది ఉదయానికి నోటి చుట్టూ ఎండిపోయి కనిపించేది.
శ్వాసలో ఇబ్బంది తొలగించడానికి 2015 లో శస్త్రచికిత్స ద్వారా అడెనాయిడ్లు తొలగించబడ్డాయి కానీ ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. ఆమె శ్వాసకోశ ఇబ్బందులు వారి ఇంట్లో ఉన్న కీటకాలు లేదా తలలో పేలు వలన ఏర్పడుతున్నట్లు భావించి ఎన్నో నెలలు డీసెన్సిటైజేషన్(గ్రాహతను తగ్గించేందుకు చాలాకాలం వైద్యం చేసే విధానము) చికిత్స కూడా తీసుకుంది. అది కూడా గణనీయమైన మెరుగుదల ఇవ్వలేదు.
2018 ఆగస్టు 8వ తేదీన పాప కుటుంబ సభ్యులు ఈ లక్షణాలన్నీ అభ్యాసకునికి వివరించి పోస్టు ద్వారా క్రింది నివారణలు పొందారు.
CC3.1 Heart tonic + CC9.1 Recuperation + CC11.5 Mouth infections + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS
చికిత్స సమయంలో పాప వేరే ఇతర మందులు ఏమీ తీసుకోలేదు. ప్రాక్టీషనర్ ఇచ్చిన నివారణలు తీసుకున్న వారం తర్వాత ఆమె ముక్కుతో స్వల్పంగా గాలి పీల్చుకోవడం ప్రారంభించింది. శరీరము యొక్క వేడి మరియు చమట అప్పటికంటే కొంచెం తక్కువ అయ్యింది. అధిక ఉష్ణోగ్రతను భరించే సామర్ధ్యం కూడా పెరిగింది. మొత్తం మీద ఆమెకు 20 శాతం ఉపశమనం కలిగింది. అయితే నోటిలో లాలాజలం విషయంలో 50 శాతం పెరుగుదల కనిపించింది. మరొక మూడు వారాల తర్వాత ఆమెకు అన్ని లక్షణాల్లో 50 శాతం మెరుగుదల కనిపించింది. లాలాజలం పూర్తిగా ఆగిపోయింది. 2018 అక్టోబరు 24వ తేదీ నాటికి కేవలం 11 వారాల్లో ఆమె వ్యాధి లక్షణాలు పూర్తిగాపోయి సాధారణ స్థాయిలో గాలి పీల్చుకోవడం ప్రారంభించింది. లాలాజలం స్రవించడం ఆగిపోయింది. శరీర ఉష్ణోగ్రతలు తగ్గటమే కాకుండా అధికంగా చెమట పట్టడం కూడా తగ్గింది. రోగికి టాన్సిల్స్ వలన నొప్పి లేదా అసౌకర్యం లేదు కనుక దానికి చికిత్స ఏమీ ఇవ్వలేదు కనుక అవి ఇంకా స్వల్పంగా విస్తరించే ఉన్నాయి.
నివారిణి మరొక నెల రోజుల పాటు అనగా 2018 నవంబర్ 24 వరకు TDS స్థాయిలో కొనసాగింది. 2018- 19 శీతాకాలంలో పాప ఆరోగ్యంగా ఉండడమే కాక కనీసం జలుబు కూడా లేదు. అలాగే 2019 జూన్ 16 నాటికి పాప పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇరవై రెండు కేజీల బరువు కూడా ఉంది. అయితే ఫోన్ ద్వారా వినడంలో అవగాహనా లోపం కారణంగా మోతాదు తగ్గించే విధానము కొనసాగలేదు.