చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ 11602...भारत
48 ఏళ్ల మహిళ చెవుల్లో 4 సంవత్సరాల క్రితం దురద రావడం తో అది ఫంగల్ ఓటిటిస్ ఎక్స్‌టర్నాతో బాధపడుతోందని పరీక్షల ద్వారా తెలిసింది. యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఫంగల్ చెవి చుక్కలతో ఉపశమనం పొందింది. ఇది 2 సంవత్సరాల క్రితం మరల వచ్చినప్పుడు అదే చికిత్స తీసుకుంది. మళ్ళీ 3 వారాల క్రితం దురద ప్రారంభమైంది; ఈసారి ఆమెకు అల్లోపతి ఔషధం మరియు చెవి చుక్కలతో పాక్షిక ఉపశమనం లభించింది.
కాబట్టి ఆమె అల్లోపతి మందులు తీసుకోవడం ఆపివేసింది మరియు 20 జనవరి 2019 న ప్రాక్టిషనర్ ని సందర్శించినప్పుడు, ఈ క్రింది మందును 10 నిమిషాల కొకసారి చొప్పున ఒక్క గంటకి ఇచ్చి తరువాత 6TD గా తీసుకోమన్నారు:
#1. CC5.1 Ear infections + CC12.1 Adult tonic + CC21.7 Fungus…one dose every 10 minutes for one hour followed by 6TD
మొదటి గంటలో, ఆమెకు దురద రాలేదు మరియు తరువాత రోజు, అది కొంచెంగా వుంది. ఈ ఫలితాలు చూసిన తరువాత మరుసటి రోజు, ఆమె అల్లోపతి చెవి చుక్కలను కూడా ఆపివేసింది మరియు ప్రాక్టిషనర్ అల్లోపతి చెవి చుక్కల బదులుగా ఈ క్రింది వైబ్రో చుక్కలను ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ తో తయారుచేసి చెరోక చెవి లోను ఒక చుక్క వేయమన్నారు:
#2. CC5.1 Ear infections + CC21.7 Fungus…TDS in extra virgin olive oil, 1 drop in each ear
నూనెను చెవిలో చుక్కలుగా వేసుకోవడానికి మొదట్లో సంశయించినప్పటికీ, ఆమె దీనిని ప్రయత్నించడానికి అంగీకరించింది. మరుసటి రోజు ఆమె దురద 90% తగ్గినట్లుగా తెలియచేసింది. మూడవ రోజు 23 జనవరి 19 న, దురద పూర్తిగా పోయింది. # 1 మోతాదు TDS కి తగ్గించబడింది. ఫిబ్రవరి 15 న, # 1 మరియు # 2 రెండింటి మోతాదు OD కి తగ్గించబడింది.1 మార్చి 2019 న, ENT వైద్యుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క జాడ లేకుండా ఆమె చెవి రంధ్రము ఆరోగ్యంగా ఉందని కనుగొన్నారు. కాబట్టి 2 వారాల తర్వాత # 2 ఆపివేయబడింది మరియు # 1 ని క్రమంగా 3 వారాల వ్యవధిలో OD నుండి OW కి తగ్గించబడింది. ఏప్రిల్ 2019 నాటికి, నొప్పి రాలేదు కాని ఆమె # 1 ని OW గా కొనసాగిస్తుoది.