ధీర్గకాలిక దగ్గు 11573...भारत
16 ఏళ్ల బాలుడు 3 సంవత్సరాల వయస్సు నుండి దగ్గు మరియు జ్వరంతో కొన్నిసార్లు జలుబు మరియు గొంతునొప్పితో తరచూ (నెలకు ఒకసారి) బాధపడుతున్నాడు. వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చినా ఇవి ఎక్కువవుతున్నాయి. ప్రతిసారీ అల్లోపతి ఔషధం తీసుకున్నప్పుడు అతను 5-6 రోజుల్లో ఉపశమనం పొందుతాడు, కానీ అది తాత్కాలికమే. అతని తల్లి వైబ్రియోనిక్స్ ప్రయత్నించినందున ఆమె స్వయంగా అతన్ని ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చింది. బాలుడికి గత రెండు రోజులుగా తేలికపాటి జలుబు, దగ్గు వచ్చింది. అతను ఈసారి అల్లోపతి ఔషధం తీసుకోలేదు.
5 ఆగష్టు 2018 న ఈ కింది మందు ఒక వారానికి ఇచ్చారు.
#1. SR218 Base Chakra…OD for a week
దాని తరువాత పుల్లౌట్ లేదు, బదులుగా అతని పరిస్థితి మెరుగుపడింది. 3 రోజుల విరామం తరువాత అంటే 15 ఆగస్టు 2018 న, ఈ క్రింది మియాస్మ్ ఒక డోస్ ఇవ్వబడింది:
#2. SR252 Tub-Bac
మరుసటి రోజు బాలుడు తనకు చాలా బాగుందని మరియు జలుబు లేదా దగ్గు లక్షణాలు లేవని తెలిపాడు. పుల్లౌట్ లేనందున, # 2 యొక్క రెండవ మోతాదు 30 ఆగస్టు 2018 న ఇవ్వబడింది. 3 వారాల తరువాత, బాలుడు తాను బాగా వున్నట్లు తెలియచేసాడు. ఈసారి కూడా పుల్లౌట్స్ లేనందున, # 2 యొక్క మరొక మోతాదు ఇవ్వవలసిన అవసరం రాలేదు.
బాలుడు ఆరోగ్యo బాగానే వుండి మరింత ఆనందంగా కనిపించాడు మరియు వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి ఫిర్యాదులు లేవు. 2018-19 మొత్తం శీతాకాలంలో కూడా ఎటువంటి సమస్య రాలేదు. 17 ఏప్రిల్ 2019 న, సమస్య పునరావృతం కాకపోవడం వల్ల ప్రాక్టిషనర్ బాలుడిని ఒప్పించి, CC12.1 Adult tonic…TDS ను ఒక నెల పాటు తరువాత CC17.2 Cleansing అతని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఒక ఏడాది పాటు ఇవ్వడానికి ఒప్పించాడు.
SRHVP లేని ప్రాక్టీషనర్లు సీనియర్ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాలి.