లూపస్ 03571...थाईलैंड
ప్రాక్టీషనర్ యొక్క 26 ఏళ్ల మహిళా సహోద్యోగి జూన్ 2018 లో ఆమె చేతులు మరియు ముఖంపై దద్దుర్లు మరియు చెవుల లోపలి భాగంలో ఎర్రబడటం వచ్చింది. ఆమె ముఖం వాయటమే మాత్రమే కాకుండా ముఖంపై దద్దుర్లు 4 సెం.మీ పరిమాణంలో పెద్దవిగా ఉన్నాయి(రోగి ఫోటో తీయడానికి ఇష్టపడలేదు). ఆమె చర్మవ్యాధి నిపుణుడు సూచించిన విధంగా ఆమె రోజుకు రెండుసార్లు యాంటీ అలెర్జీ ఔషధం (సెటిరిజైన్) వాడుతోంది. వైబ్రియోనిక్స్ రెమెడీ తీసుకోవాలని ప్రాక్టీషనర్ ఆమెకు సూచించినప్పుడు, ఆమె ఒప్పుకోలేదు ఎందుకంటే వేరే మందులు తీసుకోకూడదని డాక్టర్ ఆదేశించారు. చర్మం యొక్క బయాప్సీ 2 రోజుల క్రితం మాత్రమే జరిగింది మరియు నివేదిక త్వరలోనే రానున్నది. వైబ్రియోనిక్స్ యొక్క ప్రయోజనాలు తెలియజేసి దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు రావని ప్రాక్టీషనర్ ఆమెకు వివరించినప్పుడు, చర్మం పైన ఉపయోగించటానికి ఆమె అంగీకరించింది.
25 ఆగస్టు 2018 న, ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది మందును కొబ్బరి నూనెతో తయారు చేసి చర్మ పైబాగంలో రాయడానికి ఇచ్చాడు:
CC8.1 Female tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.7 Fungus…TDS
3 రోజుల తరువాత, ఆమె చేతులు మరియు ముఖంపై దద్దుర్లు తగ్గడం ప్రాక్టీషనర్ గమనించాడు; ఆమె చెవుల్లో ఎరుపు దాదాపుగా కనుమరుగైంది. పక్షం రోజుల్లో ఆమె ముఖం మీద దద్దుర్లు, ఎరుపు మరియు వాపు కనిపించలేదు. మరో 2 వారాల తరువాత, రోగి సెటిరిజైన్ తీసుకోవడం మానేశారు, కాని 20 అక్టోబర్ 2018 వరకు మరో నెలపాటు వైబ్రియోనిక్స్ రెమెడీని ఉపయోగించడం కొనసాగించింది, ఆమె పూర్తిగా నయమైందని భావించినందున ఆమె దానిని ఆపివేసింది. ఆమె ఉద్యోగ నిమిత్తం వేరొక ప్రదేశానికి వెళ్ళిన కారణంగా ప్రాక్టీషనర్ ఆమెను కలవలేదు, కానీ ఆమె బయాప్సీ నివేదికలో ఆమెకు లూపస్ ఉందని వచ్చింది కానీ, అది ఇప్పుడు వైబ్రియోనిక్స్ చికిత్సతో అదృశ్యమైంది. 30 ఏప్రిల్ 2019 నాటికి, ఇది 6 నెలలకు పైగా ఉంది మరియు సమస్య పునరావృతం కాలేదు.