ప్రక్క తడపటం / ఆధీనంలో లేని మూత్ర విసర్జన (ఎన్యురేసిస్) 11568...भारत
స్వతహాగా సిగ్గుపడే స్వభావం కల 13 సంవత్సరాల బాలుడు గత పది సంవత్సరాలుగా పక్క తడిపే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ బాలుని తల్లి అతడు నిద్రపోయే ముందు మూత్రం పోసుకొని వచ్చేటట్లుగా చేస్తున్నప్పటికీ బాలుడు నిద్రపోయిన మూడు గంటల్లోనే సుమారు ఒంటిగంట ప్రాంతంలో పక్కతడుపుతున్నాడు. అంతేగాక శీతాకాలంలో బాలుడు సాయంత్రం పూట ఎక్కువ నీళ్లు తాగకుండా ఉండేలాగా ఆమె జాగ్రత్త వహిస్తున్నప్పటికీ సమస్య కొనసాగుతూనే ఉంది. బాలుడికి రెండు నెలలపాటు అలోపతి చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు కనుక ఆ మందును ఆపివేయడం జరిగింది. ఈ సమస్య బాలుని మానసికంగా కుంగదీసి ఆత్మ విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది. పాఠశాల కు సంబంధించిన విహార యాత్రలో రాత్రిపూట వేరొకచోట ఉండవలసిన పరిస్థితి ఉన్నట్లయితే కనీసం అటువంటి వాటి గురించి ఆలోచించే సాహసం కూడా బాలుడు చేయలేకపోతున్నాడు. అలాగే సెలవులలో బంధువుల ఇంటికి వెళ్లడం కూడా మానేశాడు.
2018 సెప్టెంబర్ 29వ తేదీన అభ్యాసకుడు బాలుడికి క్రిందిరెమిడీ ఇచ్చారు:
CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…TDS
పడుకోవడానికి నిద్రించడానికి గంటముందు మంచినీళ్లు తాగవద్దు అని అభ్యాసకుడు సూచించారు. రెండు వారాల్లో పక్క తడపడం సగానికి తగ్గాయి. 15 రోజుల తర్వాత వారానికి ఒకసారి పక్కతడిపే పరిస్థితి వచ్చింది. బాలుడు మోతాదును మరో రెండు నెలలు TDS గా తీసుకున్నాడు. ఈ సమయంలో పక్క తడపడం 15 రోజులకు ఒకసారి వచ్చేది. 2019 జనవరి 5 నాటికి మోతాదును BDకి తగ్గించడం జరిగింది. ఆ తర్వాత పక్కతడిపే పరిస్థితి ఏర్పడలేదు. ఫిబ్రవరి5 నాటికి మోతాదును OD కి ఆ తర్వాత మెల్లగా OWకి తగ్గించడం జరుగుతుంది. 2019 ఫిబ్రవరి 23 నాటికి సమస్య పునరావృతం లేకుండా బాలుడికి పక్కతడపడం అనే సమస్య పూర్తిగా తగ్గిపోయింది.
సంపాదకుని వ్యాఖ్య: సీనియర్ ప్రాక్టీషనర్ లు NM65 Bedwetting కార్డులు ప్రయత్నించ వలసిందిగా సూచన. అయితే ఇది ఎన్నో కేసులలో సత్వర ఫలితాన్ని ఇచ్చింది.