మైగ్రేన్, నెలసరిలో అధిక రక్తస్రావం (మెనోరేజియా) 11602...भारत
2018 జులై 26వ తేదీన 32 ఏళ్ల మహిళ బహుళ ఫిర్యాదులతో అభ్యాసకుడిని సంప్రదించారు. ఆమెకు తలనొప్పి తో పాటు వికారం గత ఐదు సంవత్సరాలుగా నెలకి ఒకటి లేదా రెండు సార్లు వస్తోంది. ఇది ఆమెకు నుదుటి ఎడమభాగాన ప్రారంభమై ఆమె ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు లేదా ప్రకాశవంతంగా ఉండే కాంతికి గురి అయినప్పుడు ఎక్కువవుతోంది. ఈమెకు గత మూడు సంవత్సరాలుగా నెలవారీ బహిష్టు సక్రమంగానే సరైన సమయంలోనే వస్తున్నప్పటికీ ఆ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటోంది. కొన్నిసార్లు ఇది బాధాకరంగా కూడా ఉంటోంది. ఈమె గత రెండు సంవత్సరాలుగా అలసట మరియు శక్తి హీనత తో బాధపడుతున్నారు. అయితే గత రెండు నెలలుగా ఇది మరింత ఎక్కువగా ఉంది. ఈమె చూడటానికి పాలిపోయినట్లుగా ఉండి డాక్టర్లను సంప్రదించాలన్నాఆస్పత్రికి వెళ్లాలన్న భయపడుతున్నారు.
ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC3.1 Heart tonic + CC8.7 Menses frequent + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
ఆమె తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్ మరియు ఆకుకూరలు చేర్చుకోవాలని, తగినంత నీరు తాగాలని అభ్యాసకుడు ఇచ్చిన సలహాను ఆమె అనుసరించారు. ఒక వారం రోజుల్లోనే ఆమెకు శక్తివంతంగా సంతోషంగా అనిపించడం ప్రారంభించింది. మరో వారంలో ఆమె శక్తి స్థాయిలో 90 శాతం పెరుగుదల కనిపించింది. అలా నెల రోజులుగా మోతాదు కొనసాగిస్తూ ఉండగా 2018 సెప్టెంబర్ 10 ఉదయం ఆమెకు తలనొప్పి ఎక్కువగా ఉండడంతో అభ్యాసకుడిని సంప్రదించారు. అభ్యాసకుడు ప్రశ్నించిన మీదట ఆమెకు తలపోటు తగ్గిపోవడంతో గత రెండున్నర వారాలుగా మోతాదును తీసుకోవడం లేదని అంగీకరించారు. కనుక ఆమెను నివారణను TDSగా తిరిగి ప్రారంభించమని చెప్పడం జరిగింది. ఒక వారం తర్వాత సెప్టెంబర్ 17వ తేదీన ఆమె చాలా శక్తివంతంగా ఉన్నట్లు బహిష్టు సమయంలో నొప్పి గాని అధిక రక్తస్రావం గాని ఏమీ లేవని అలాగే అధిక వత్తిడి గాని తలపోటు గాని లేవని చెప్పడం జరిగింది ఆమె తన పని ఆనందంగా చేసుకోవడంతోపాటు పిల్లలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా చక్కగా నిర్వహించ గలుగుతున్నారు. మోతాదును ODకి, రెండు వారాల తర్వాత OW స్థాయికి తగ్గించడం జరిగింది. 2019ఫిబ్రవరి 21 నాటికి వ్యాధి లక్షణాలు పునరావృతం కాకపోవడంతో ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. మోతాదును ముందస్తు జాగ్రత్త కోసం OW గా కొనసాగిస్తున్నారు.