రైనైటిస్ 03572...गैबॉन
29 ఏళ్ల మహిళ ఎంతో కాలంగా ఉదయాన్నే తలనొప్పి మరియు చిగుళ్లలో నొప్పితో ( నెలకు సగటున రెండు సార్లు) పాటు తుమ్ములతో బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య ఆమెకు బాల్యంలోనే ప్రారంభమయ్యింది కానీ రెండేళ్ల క్రితమే ఆమె ఇ.ఎన్.టి. స్పెషలిస్టుకు చూపించగా ఇది దీర్ఘకాలిక రైనైటిస్ అని నిర్ధారించారు. ఆమె అల్లోపతి మందులు తీసుకుంటున్నారు కానీ ఇది ఆమెకు రెండు మూడు రోజులు మాత్రమే ఉపశమనం ఇస్తూ ఆ తర్వాత వ్యాధి లక్షణాలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అభ్యాసకుని సంప్రదించడానికి 3 రోజుల క్రితం ప్రారంభమైన తీవ్రమైన తలనొప్పి మరియు చిగుళ్ళ నొప్పితో ఆమె 31 ఆగస్టు 2018 న అభ్యాసకుని సందర్శించారు.(ఈమెకు ఏడు సంవత్సరాల వయస్సు నుండి హస్వదృష్టి కూడా ఉంది మరియు ఆమె తన దృష్టిని మెరుగుపరుచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు).
ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది:
CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies...ప్రతి పది నిమిషములకు ఒకసారి ఒక గంట వరకు ఆ తరువాత 6TD
ఈ నివారణ తీసుకునే సమయంలో ఆమె అలోపతి మందులు తీసుకోవడం పూర్తిగా మానివేశారు. పదిరోజుల తర్వాత ఆమెకు పులౌట్ ఏర్పడి ఆమెకు తలనొప్పి మరియు తుమ్ముల తో బాధ భరింపరానిదిగా ఉంది. కానీ ఆమె దీనిని త్వరగా అధిగమించాలని మోతాదును 6TD గానే కొనసాగించారు. ఈ పులౌట్ రెండు రోజులు మాత్రమే ఉండి అ తరువాత ఆమె యొక్క పరిస్థితి మెరుగు పడడం ప్రారంభించింది. మూడు రోజుల తర్వాత ఆమెకు అన్ని వ్యాధి లక్షణాల నుండి 90% ఉపశమనంకలుగగామూడు రోజుల అనంతరం 17 సెప్టెంబర్ నాటికి వ్యాధిలక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. మోతాదును ఒక వారం పాటు TDSకు ఆ తర్వాత మరొక వారం OD కి తగ్గించి చివరగా 30 సెప్టెంబర్ నాటికి పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఆమె యొక్క కంటి దృష్టి మెరుగు పడటానికి ఒక ప్రత్యేకమైన కాంబో ఇవ్వడం జరిగింది. 2019 ఫిబ్రవరి నాటికి ఆమెకు వ్యాధి లక్షణాలు పునరావృతం కాకుండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.