అండాశయ కణుతులు 03524...यूएसए
23-సంవత్సరాల మహిళ గత పది సంవత్సరాలుగా రుతుక్రమంలో భారీ రక్తస్రావం మరియు నొప్పితో బాధపడుతూ వున్నారు. జూన్ 2015 లో ఆమె ఎడమ అండాశయంలో 2 మిల్లీమీటర్ల కణితి ఉన్నట్లు మెడికల్ రిపోర్టులను బట్టి నిర్ధారణ అయ్యింది. ఆమె రెండు నెలలు అల్లోపతి మందులు తీసుకుని మెరుగుదల లేకపోవడంతో మానేసారు. డిసెంబర్లో ఆమె మరొక అండాశయంలో కూడా అదే పరిమాణంలో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
2016ఫిబ్రవరి 16వ తేదీన ఆమె తల్లి సలహా మేరకువైబ్రియనిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అభ్యాసకుడు ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వడం జరిగింది:
CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.7 Menses frequent + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…TDS
రెండు వారాల్లోనే రోగి యొక్క తల్లి తమ కుమార్తె ఇప్పుడు మరింత ప్రశాంతంగా నమ్మకంగా నివారణాలను కొనసాగించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అభ్యాసకుడికి తెలియజేశారు. ఆరు వారాల తర్వాత ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష జరిగింది. రెండు అండాశయములలోనూ తిత్తులు మాయమయ్యి సాధారణ స్థితిలో ఉన్నట్లు రిపోర్టు ద్వారా తెలిసింది. ఆమెకు కడుపు నొప్పి రక్తస్రావం 50 శాతం తగ్గింది. ప్రతి పీరియడ్ కు ఆమెకు పరిస్థితి మెరుగుపడుతూ జూలై నాటికి 75% ఉపశమనం కలిగింది. మరో మూడు నెలలు నివారణ కొనసాగించిన తర్వాత బాధాకరమైన పీరియడ్స్ నుండి పూర్తిగా కోలుకున్నారు. మోతాదు మరో రెండు వారాల పాటు ODకి, తర్వాత రెండు వారాల పాటు 3TW గానూ, మరో వారానికి 2TW, ఆ తరువాత OWగానూ తగ్గించ బడింది. రెమిడీ తీసుకోవడం 2016 డిసెంబర్ లో నిలిపివేయబడింది. 2018 ఫిబ్రవరిలో చివరిసారిగా సంప్రదించినప్పుడు రోగి అండాశయం లో తిత్తులు పునరావృతం కాలేదని మరియు నొప్పి లేకుండా రుతుస్రావం సాధారణంగా సక్రమంగా వస్తోందని ధృవీకరించారు.