కడుపు ఉబ్బరం 11587...भारत
49-ఏళ్ల వయసు గల వ్యక్తి కడుపు ఉబ్బరం, బరువు మరియు నొప్పితో గత ఆరు సంవత్సరాలుగా బాధపడుతున్నారు. అతను రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడుతుంటారు. మరియు అతిగా తినడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. అంతేగాక ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు అంటే చాలా ఇష్టం. అనేక మంది వైద్యులను సంప్రదించి ఆయుర్వేదం మరియు హోమియోపతి తో సహా వివిధ రకాల వైద్య విధానాలను ప్రయత్నించినా ఎటువంటి ఫలితం లేదు. ఇవేమీ అతనికి నివారణ ఇవ్వలేదని ఒక విధమైన నిరాశలో ఉన్నారు.
2018 ఫిబ్రవరి 1 న అతనికి క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.4 Eating disorders…ప్రతీ పది నిమిషాలకి ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD.
రెండు వారాలలో కడుపు ఉబ్బరం గణనీయంగా తగ్గింది, కడుపు భారం పూర్తిగా పోయింది మరియు నొప్పి కూడా లేదు. మోతాదును TDS కి తగ్గించారు. మరో ఆరు వారాల తర్వాత అన్ని లక్షణాలు మాయమయ్యాయి. రోగి మోతాదును TDSగా మరో మూడు నెలలు కొనసాగించాలని ఎంచుకున్నారు. తన శారీరక వ్యవస్థ కు తగ్గట్టుగా ఆహారపు అలవాట్లను సవరించుకోవాలసినదిగా అభ్యాసకుడు సూచించారు. రోగి ఆ తర్వాత తగ్గించిన మోతాదును OD. గా తీసుకున్నారు. అభ్యాసకుడు అమెరికా నుండి భారతదేశానికి తిరిగి రావడంతో రోగిని అమెరికాలో ఉన్న మరొక అభ్యాసకుని వద్దనివారణ తీసుకోవలసిందిగా సూచించారు. డిసెంబర్ 2018 నాటికి రోగి ముందు జాగ్రత్త కోసం OD గా తీసుకుంటున్నారు. సమస్య పునరావృతం కాలేదు.