చర్మ ఎలర్జీ లు 11587...भारत
72-సంవత్సరాల వయసు గల వ్యక్తి ఒక మురికి వాడలో అనారోగ్య పరిస్థితుల్లో నివసిస్తూ గత 12 సంవత్సరాలుగా తన కుడి పాదం మీద ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నారు. చర్మం యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. సుమారు 3 అంగుళాల వ్యాసం కలిగిన నల్లని మచ్చ చీమును స్రవిస్తోంది. అతనికి భయంకరమైన దురద మరియు నొప్పి కూడా ఉండి సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు. అతను కార్యాలయంలో తన విద్యుక్త ధర్మాన్ని కూడా నిర్వర్తించ లేక తరచుగా సెలవలు పెడుతున్నారు. కొంతకాలం క్రితం ఆసుపత్రిలో చేరినప్పుడు కొంతఉపశమనం లభించింది. ఫార్మసీ నుండిగాయానికి లేపనం మందులు తెచ్చుకుని రాస్తూ ఉండేవారు. ఇతను 2017 జులై 19న అభ్యాసకుని సందర్శించినప్పుడు ఎటువంటి ఔషధం తీసుకోవడం లేదు. అతనికిక్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC21.7 Fungus + CC21.11 Wounds & Abrasions…QDS
#2. CC21.2 Skin infections + #1…BD విభూతితో కలిపి మచ్చ పైపూతగా రాయడానికి.
వారం రోజుల్లో చీము కారడం ఆగిపోయింది. మరో పది రోజుల్లో దురద మరియు నొప్పి తగ్గి పోయాయి. అతను అసౌకర్యం లేకుండా నడవగలుడమే కాక తన కార్యాలయ విధులను తిరిగి ప్రారంభించుకో గలిగారు. అయినప్పటికీ నల్లనిమచ్చఅలాగే కొనసాగింది. అయితే రోగి ఆరు వారాల తర్వాత రీఫిల్ కోసం వచ్చేటప్పటికి ఈ మచ్చఅదృశ్యమైంది. మోతాదును #1 ని TDS కు తగ్గించినప్పటికీ #2మాత్రం BD. గానే కొనసాగింపబడింది. ఒక నెల తరువాత అతనికి బాగానే ఉన్నట్లు చెప్పాడు కానీ రీఫిల్ కోసం రాలేదు. కనుక అభ్యాసకుడు ఉద్దేశించిన విధంగా మోతాదును మార్చడం సాధ్యం కాలేదు. రోగి అభ్యాసకుని నివాసానికి సమీపంలోనే ఉండడం వలన ఫిబ్రవరి 2019 నాటికి సమస్య పునరావృతం కాలేదని తెలుసుకున్నారు.