అసిడిటీ,మూత్రం ఆపుకోలేని తనము, కటి ప్రాంతంలో మంట 11601...India
86-ఏళ్ల మహిళకు తీవ్రమైన మరియు దీర్ఘకాలిక బహుళ సమస్యలు ఉన్నాయి. గత ఒక సంవత్సరం నుండి ఆమె ప్రతీ రోజూ గుండెల్లో మంటతో బాధపడుతోంది. మరియు ప్రతీ రోజు భోజనం తర్వాత త్రేనుపులు బాగా వస్తూ ఉంటాయి. గొంతు మరియు అన్నవాహిక కాలిపోతున్న అనుభూతి ఉండడంతో ఆమె సులభంగా ఏమీ తినలేకపోయేడి. ఆమ్లత్వం యొక్క లక్షణాలు తీవ్రంగా ఉన్నందువలన ఆమె 25 సెప్టెంబర్ 2018 న అభ్యాసకుడిని సందర్శించింది. నెల రోజులుగా ఆమెకు రాత్రిపూట పక్కతడపడం మరియు పగటిపూట అసంకల్పితంగా మూత్ర విసర్జన చేయడం, అలాగే పొత్తి కడుపులో నొప్పి వంటివి కూడా ఉన్నాయి. ఇది యు.టి.ఐ. మరియు కిద్నే ఇన్ఫెక్షన్ అని నిర్ధారించబడింది, దీని కోసం ఆమె అల్లోపతి మందులను కొంతకాలం తీసుకుంది కానీ అవి ఏమాత్రం సహాయం చేయనందువలన ఆమె వాటిని తీసుకోవడం మానేసింది. ఇదే కాక ఆమెకు 46 వ సంవత్సరం నుండీ అనేక మార్లు గుండెపోటు వచ్చిందని అప్పటి నుండి ఆమె దీనికి కూడా అల్లోపతి మందులను తీసుకుంటూ ఉన్నట్లు చెప్పారు.
ఈమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic… గంట సమయం వరకూ ప్రతీ 10 నిమిషాలకూ ఒక డోసు అనంతరం 6TD
రెండు రోజుల్లో ఆమెకు ఆమ్లత్వం, బెడ్‌వెట్టింగ్ మరియు ఆపుకొనలేనితనం మొదలగు వ్యాధులకు సంబంధించిన లక్షణాలన్నీ తగ్గిపోయాయి. పొత్తికడుపులో నొప్పి 90% తగ్గింది. ఐతే నాలుగు రోజుల తరువాత అనగా 2018 అక్టోబర్ 1 తేదీన రోగికి పొత్తి కడుపులో ఆకస్మికముగా తీవ్రమైన నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేరారు. రెండు వారాలు ఐ.సి.యు. లో ఉన్నప్పుడు వైద్యులు వివిధ పరీక్షలు చేసారు. శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు కానీ రోగికి అలా చేయించుకోవడం ఏమాత్రం ఇష్టములేదు. కాబట్టి అవసరమైనప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకోవాలన్న సలహాతో ఆమె డిశ్చార్జ్ అయ్యింది. కాని అది ఎటువంటి ఉపశమనం ఇవ్వలేదు. 2018 అక్టోబర్ 20 తేదీన ఆమె చికిత్సా నిపుణురాలిని సంప్రదించారు. రోగికి ఏమి ఇవ్వాలో తెలియక, చికిత్సా నిపుణురాలు స్వామిని గాఢంగా ప్రార్థించారు. ఆమె ధ్యాన స్థితిలో రోగి యొక్క కటి మంట మరియు చుట్టుపక్కల అవయవాలకు ఈ క్రింది కాంబోలను ఇవ్వడానికి ఆమెకు మార్గనిర్దేశము చేయబడింది:
#2. CC4.3 Appendicitis + CC8.4 Ovaries & Uterus + CC8.5 Vagina & Cervix…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఒక గంట వరకూ తరువాత 6TD
రెండు రోజులలో పొత్తి కడుపు నొప్పి మాయమైంది 5 రోజుల తరువాత, మోతాదును TDS తగ్గించారు 8 వారాల తరువాత, రోగి నొప్పి పునరావృతం కాలేదని తెలిపారు. మోతాదును ఒక వారము రోజుల వరకూ OD కి తగ్గించి ఆపై నిలిపివేశారు. 2018 డిసెంబర్ 30 నాటికి రోగి తన యొక్క వ్యాధిలక్షణాల నుండి పూర్తి ఉపశమనం పొందారు.
అభ్యాసకురాలు మరో రెండు రోజుల్లో పేషంటు యొక్క తదుపరి సందర్శన ఉంది కనుక ఆమెకు ఈ క్రింది రెమిడీలను ఇవ్వాలనుకున్నారు:
#3. CC3.1 Heart tonic + CC4.10 Indigestion + CC12.1 Adult tonic…TDS, ముందు జాగ్రత్త కోసం.
సంపాదకుని సూచన: ప్రాక్టీషనర్ రోగి యొక్క గుండెకు ఉన్న రుగ్మతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తకోసం హార్ట్ మరియు సర్క్యులేషన కోంబోలను కలిపారు.