దీర్ఘకాలిక సయాటికా నొప్పి 11600...India
అభ్యాసకుడి యొక్క 75 ఏళ్ల మాతృమూర్తి తన కుడి కాలికి ముఖ్యంగా మోకాలి నరాలకు గత 10 సంవత్సరాలుగా నొప్పి ఉంటోంది. అవసరమైనప్పుడు ఆమె పెయిన్ కిల్లర్లను తీసుకునేవారు కానీ ఇది ఆమెకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చేది.
AVP గా అర్హత సాధించిన వెంటనే, అభ్యాసకుడు ఆమెకు చికిత్స చేయాలని 2018 ఆగస్ట్ 13 న క్రింది రెమిడీ ఆమెకు ఇచ్చారు:
#1. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
3 రోజుల తరువాత నొప్పి 30% తగ్గిందని, అలాగే 7 రోజుల తరువాత 50% తగ్గిందని ఆవిడ చెప్పారు. వైబ్రో రెమిడీలు ప్రారంభించక ముందే ఆమె నొప్పి నివారణలు తీసుకోవడం మానేసారు. ఐతే 23 ఆగస్ట్ 2018 తేదీన ఆమె వెన్ను భాగము, మరియు కాలు పూర్తిగా నొప్పి రావడంతో అభ్యాసకుడు #1 ను క్రింది విధంగా మార్చారు:
#2. CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissues + CC20.5 Spine + CC20.6 Osteoporosis + #1…TDS
26 ఆగస్ట్ 2018 తేదీన రోగికి జలుబు దగ్గు ఏర్పడడంతో క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#3. CC9.2 Infections acute + CC19.6 Cough chronic…TDS
మరో మూడు రోజుల తరువాత రోగి యొక్క జలుబు దగ్గు విషయంలో 80% ఉపశమనం కలిగింది. నొప్పి విషయంలో 50% ఉపశమనం పొందారు. #1 2 మరియు#రెండింటిని OD కి తగ్గించడం జరిగింది. నెల తరువాత అనగా సెప్టెంబర్ 12 నాటికి, ఆమె నొప్పుల విషయంలో100% ఉపశమనంతో పాటు జలుబు మరియు దగ్గు పూర్తిగా తగ్గిపోయాయి. రెండు రెమెడీల మోతాదు వారము రోజుల వ్యవధిలో 3TW, 2TW మరియు చివరికి OW కు తగ్గించ బడింది. 2018 డిసెంబర్ నాటికి ఆమెకు వ్యాధి లక్షణాలుఏవీ పునరావృతం కాకుండా OW గా మోతాదు కొనసాగిస్తూ ఉన్నారు.
సంపాదకుని వ్యాఖ్య: సాధారణంగా వ్యాధి లక్షణాలు పూర్తిగా అధృశ్యము ఐన తరువాతే మోతాదు తగ్గించడం ప్రారంభించడం జరుగుతుంది. ఐతే ఈ అసాధారణ దీర్ఘకాలిక వ్యాధి విషయంలో మోతాదు తగ్గింపు 50% ఉపశమనం కలుగగానే ప్రారంభించి నప్పటికీ వ్యాధి లక్షణాల విషయంలో త్వరగానే 100% ఉపశమనం పొందడం జరిగింది.