టెన్నిస్ఎల్బో 03511...UK
58 సంవత్సరాల వ్యక్తికి 6 నెలల క్రితం కుడి ముంజేతికి టెన్నిస్ ఎల్బో ఏర్పడింది. ఇతను ఒక టెన్నిస్ ప్లేయర్ క్రమం తప్పకుండా ఆట ఆడే వాడు కానీ ఇతనికి ఏర్పడిన రుగ్మత కారణంగా ఆటను మాని వేయవలసి వచ్చింది. ఇతను చిన్న చిన్న వస్తువులను కూడా పైకి లేప లేక పోయేవాడు. ఫిజియోథెరపీ మరియు ఇంజక్షన్ అతని యొక్క బాధను నివారణ చేయలేకపోయాయి. ఫిజియోథెరపీ చేసే వ్యక్తి ఇతని యొక్క భుజం జాయింట్ దగ్గర ఉండే స్నాయువులు (టెండాన్స్) చాలా పాడైపోయాయని అందుచేత అతనికి శస్త్ర చికిత్స అవసరం అని చెప్పాడు. అంతేకాక నాప్రాక్సోన్ టాబ్లెట్ వాడ వలసిందిగా సూచించాడు. అయినప్పటికీ పేషెంటుకు ఏమాత్రం ఉపశమనం కలుగలేదు. కనుక పేషెంట్ ఈ మందులు వేసుకోవడం మానేసాడు. శస్త్ర చికిత్స చేయించుకోవడం కూడా ఇష్టం లేక 2018 జూలై 7వ తేదీన చికిత్సా నిపుణుడిని కలిసి క్రింది రెమిడీ వాడటం ప్రారంభించాడు:
CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue...TDS
రెండు వారాల తర్వాత నొప్పి 90% తగ్గిపోయింది. కానీ చెయ్యి చిన్న వస్తువులు లేపడానికి సహకరించడం లేదు. అయితే చికిత్సా నిపుణుడు మోతాదును BD తగ్గించడం జరిగింది. మరో రెండు వారాల తర్వాత అనగా ఆగస్టు 5వ తేదీ నాటికి పేషంటు తనకు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని తన చేతిని అన్నివైపులా చాపగలుగుతున్నానని వస్తువులు పైకి లేపుతున్నా నొప్పి రావడం లేదని తెలిపాడు. నిపుణుడు మోతాదును మరో రెండు వారాలు వాడవలసిందిగా సూచించాడు. అక్టోబర్ 13వ తేదీన చికిత్సా నిపుణుడు పేషెంటును చివరి సారి చూసినప్పుడు నొప్పి ఏమాత్రం పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నట్టు మునుపటి వలే వారానికి రెండుసార్లు టెన్నిస్ కూడా ఆడగలుగుతున్నట్టు పేషంటు తెలిపారు.