పిల్లి కంటిలో హెర్పీస్ 03567...USA
ఒక జంతు సంరక్షణ కేంద్రం యొక్క నిర్వాహకుడు తనవద్ద మధ్యవయస్సులోఉన్న ఒక మగపిల్లికి వచ్చిన జబ్బు నిమిత్తము చికిత్సా నిపుణుడి యొక్క సహాయం అర్థించాడు. ఈ పిల్లికి ఎడమ కంటి నుండి నీరు కారుతుంది. కుడి కంటిలో ఒక పుండులాంటిది ఏర్పడింది (ఫోటోచూడండి). ఈ రుగ్మత కారణంగా పిల్లి ఒక మూలన కూర్చుని ఏమీ తినకుండా పగలు రాత్రి నిశ్శబ్దంగా దిగులుగా ఉంటోంది. పిల్లికి అనారోగ్యం కలిగిన వెంటనే వారు దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ కి చూపించారు కానీ ఏమి ప్రయోజనం కనిపించలేదు. డాక్టర్ దీనిని పిల్లి జాతికి చెందిన హెర్పీస్ గా గుర్తించారు. ఇది తగ్గటానికి కంటి చుక్కలను ఇచ్చారు. కానీ రెండునెలల పాటువాడినా ఏమి ప్రయోజనం కనిపించలేదు. సంస్థ వారికి ధన వనరులు లేక మెరుగైన వైద్యం చేయించలేకపోయారు అందుచేత వైబ్రియానిక్స్ మందులు ప్రయత్నించాలని యోచించారు.
15 జులై 2018 న చికిత్సా నిపుణుడు క్రింది రెమిడీ ఇవ్వడం జరిగింది:
CC1.1 Animal tonic + CC7.3 Eye infections + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.8 Herpes…3 గోళీలు పిల్లి తాగే గిన్నెలో నీటిని పోసి ఈ గోళీలు వేసి పిల్లి చేత ప్రతిరోజు తాగించడం. ఈ విధంగా ప్రతి రోజు నీళ్ళు మారుస్తూ పిల్లికి ఎంతవరకు ఉపశమనం కలిగిందో పర్యవేక్షించడం.
జులై 24వ తేదీన అనగా రెమిడి ఇచ్చిన తొమ్మిది రోజుల తర్వాత నిర్వాహకుడు చికిత్స నిపుణుడిని పిలిపించి పిల్లి కి నూటికి నూరు శాతం తగ్గి పోయిందని ఇప్పుడు పిల్లికి ఏ మాత్రం వ్యాధి లక్షణాలు లేకుండా చాలా చక్కగా ఉందని చెప్పాడు (ఫోటో చూడండి). పిల్లి ఇప్పుడు తన యొక్క బోనులో చక్కగా కూర్చో గలుగుతోందని చక్కగా తిరుగుతోందని హుషారుగా ఉండగలుగు తోందని చెప్పాడు. ఐతే చికిత్సా నిపుణుడు ముందు జాగ్రత్త కోసం రెమెడీని మరొక 7 రోజులు కొనసాగించవలసిందిగా సూచించారు.