క్రోన్స్ వ్యాధి 11594...भारत
62-సంవత్సరాల ఆస్త్రేలియన్ మహిళ గత 7 సంవత్సరాలుగా క్రోన్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ వ్యాధి వలన ఈమెకు తీవ్ర మైన కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, మలబద్దకం మరియు అతిసారం, మధ్య ప్రేగు కదలికలు, క్రమంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉన్నారు. రోగికి 2013 లో హెమికొలేక్టమి (పెద్దప్రేగు యొక్క ఒకభాగం శస్త్రచికిత్స ద్వారా తొలగించడం) చేసారు కానీ పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. పేషంటు యొక్క డాక్టరు ఈ క్రోన్స్ వ్యాధికి సరియయిన నివారణ ఏదీ లేదని చెప్పడంతో ఈమె తన జీవనవిధానము మార్చుకొని యోగా, ధ్యానము, ఆహారములో నియంత్రణ పాటించసాగారు. ఐనప్పటికీ వ్యాధి లక్షణాలు కొనసాగుతూ ఉండడంతో ఈమె నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పేషంటు తన స్నేహితురాలిని కలవడానికి ఇండియా వచ్చినప్పుడు ఈమె ఆహారం కొన్ని పుచ్చకాయ ముక్కలు మరియి ఒక ఆమ్లెట్ మాత్రమే.
ఇటువంటి పరిస్థితిలో 10ఏప్రిల్ 2018 న ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC4.1 Digestion tonic + CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC10.1 Emergencies + CC12.1 Adult tonic+ CC15.1 Mental and emotional tonic…రెండు గంటల పాటు ప్రతీ పదినిమిషాలకు ఒకడోస్ మరుసటి రోజునుండి 6TD
మరుసటి రోజుకు పేషంటుకు 60%ఉపశమనం కలిగింది కానీ కడుపులో అసౌకర్యం అలానే ఉంది. 10 రోజుల తరువాత ఈమె రోగలక్షణాలన్నీ అదృశ్యమయ్యాయి. దీనితో డోసేజ్ TDS.కు తగ్గించబడింది. ఐతే పేషంటు తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళవలసి ఉండి కనుక ఆరు నెలలకు సరిపడా మందులు ఇచ్చి మోతాదును తగ్గించే విధానము రోగికి ప్రాక్టీషనర్ వివరంగా తెలియజేసారు. నెల తరువాత పేషంటు డోసేజ్ ని OD.కి తగ్గించారు. 7 జూన్ 2018 తేదీన పేషంటు చివరిసారి పంపిన ఈమెయిలు బట్టి ఆమెకు రోగ లక్షణాలేమీ పునరావృతం కాకుండా అనందంగా ఉన్నారు. అంతేకాక తన నయంకాని వ్యాధి వైబ్రో మందులతో నివారణ ఐన విషయం తన స్నేహితిలందరికీ తెలియజేసారు.