గ్రోయింగ్ పెయిన్స్ 11594...भारत
10-సంవత్సరముల అమ్మాయి గత 5 సంవత్సరములుగా రెండు కాళ్ళు చేతుల యొక్క కండరాల నొప్పితో బాధ పడుతూ ఉన్నది. ఈ నొప్పులు మధ్యాహ్నము మరియు రాత్రి సమయంలో ఇలా వారానికి మూడుసార్లు కలగడమేకాక ఆటల్లో పాల్గొంటే ఇవి మరింత ఎక్కువయ్యేవి. నొప్పుల గురించి పాప అర్ధరాత్రి వేళ మెలుకువగా ఉండడం ఇబ్బందిగా ఉందని ఆమె తండ్రి తెలియజేసారు. పాపను ఎందరో డాక్టర్లకు చూపించగా వారు ఈ వ్యాధిని గ్రోయింగ్ పెయిన్స్ గా నిర్ధారించి మందులు ఇచ్చారు కానీ వాటివలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. ప్రాక్టీషనర్ ఈమెను కలిసే నాటికి రెండు రోజుల ముందు నుండి పాప తీవ్రమైన నొప్పితో బాధ పడుతూ ఉంది. పాప చదువుకునే పాఠశాల నుండి టీచర్ ఫోన్ చేసి పాప నొప్పితో బాధ పడుతూ ఉందని కంటిన్యూ గా ఏడుస్తూ ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు చాలా విచారానికి గురి అయ్యారు. ప్రాక్టీషనర్ పాపను కలిసేనాటికి ఆమె సన్నగా ఆకలి తక్కువగా ఉన్నట్లు కనపడింది. వైబ్రియోనిక్స్ తీసుకునేనాటికి ఆమె ఎటువంటి అలోపతి లేదా ఇతర మందులు తీసుకొనడం లేదు.
2018 మార్చి 9 వ తేదీన ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC4.1 Digestion tonic + CC12.2 Child tonic + CC15.1 Mental and Emotional tonic + CC17.3 Brain and Memory tonic + CC20.2 SMJ pain + CC20.4 Muscles and Supportive tissue…one dose every 10 minutes అలా 2 రెండు గంటల పాటు తరువాత రోజు నుండి 6TD.
10 రోజుల తర్వాత పేషంటు కు 90% ఉపశమనం కలిగింది ఐనప్పటికీ పాప తల్లిదండ్రులు 6TD. గా కొనసాగించాలని అభ్యర్ధించారు. మరొక వారం తర్వాత అనగా 26 మార్చి 2018,తేదీనాటికి బాధ పూర్తిగా అదృశ్యమయింది. అందుచేత డోసేజ్ TDS. కు తగ్గించబడింది. నెల తరువాత నొప్పి పునరావృతం కాకపోయే సరికి డోసేజ్ OD. కి తగ్గించబడింది. మరో మూడు నెలలు వాడిన తరువాత ఆగస్టు 1 వ తేదీనుండి వారు రెమిడి ఆపుదామని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 7 నాటికి పాప ఏ వ్యాధి లక్షణాలు లేకుండా ఆనందంగా ఉంది. అంతేకాక తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ఎంతో అనందం పొందారు. ప్రస్తుతం పాప తల్లి తన యొక్క కీళ్ళ నొప్పులు మరియు కణితి కి వైబ్రో మందులు వాడుతున్నారు.