నిద్రపట్టని వ్యాధి 03564...Australia
69-ఏళ్ల మహిళ తను గత పది సంవత్సరాలుగా బాధపడుతున్న నిద్రలేమి వ్యాధి నిమిత్తం అ భ్యాసకుని వద్దకు వెళ్లారు. ఆమె సాధారణంగా రాత్రి పది గంటలకు నిద్రకు ఉపక్రమిస్తే తిరిగి ఒక గంటకే మెలుకువ వచ్చేస్తుంది. ఆ ఆతర్వాత ఆమె ఆలోపతి నిద్రమాత్ర తీసుకుంటే తప్ప నిద్ర రాదు. ఐతే అలోపతి యొక్క దుష్ఫలితాలను గుర్తించి 18 ఫిబ్రవరి 2018 న ఆమె వైబ్రియో రెమిడి తీసుకోవడం ప్రారంభించక ముందే నిద్రమాత్రలు తీసుకోవడం నిలిపివేశారు.
ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC15.6 Sleep disorders...నిద్రపోయే ఒకగంట ముందు ఒక మాత్ర. అప్పటికీ నిద్ర రాకపోతే నిద్ర పట్టేంతవరకూ ప్రతీ పది నిమిషాలకు ఒక గోళీ వేసుకోవాలి.
చికిత్స ప్రారంభించిన రెండు రోజుల తర్వాత పేషంటుకు 90% ఉపశమనం లభించింది. ఎందుకంటే ఆమెకు మొదటి మాత్రకే చక్కగా నిద్ర పట్టడమే కాక మరలా గంట తర్వాత మెలుకువ రావడం లేదు. ఐతే అర్ధరాత్రి మరొక గోళీ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడేది ఈ విధంగా మూడునెలలు గడిచిన తర్వాత అర్ధరాత్రి వేసుకునే గోళీ అప్పడప్పుడు వేసుకునే అవసరం మాత్రమే కలిగేది.
ఈ విధంగా మరొక నెల గడిచిన తర్వాత జూన్ 2018, నాటికి ఆమెకు పూర్తి ఉపశమనం కలిగి అరగంట తర్వాత రెండవ డోస్ తీసుకునే అవసరం అప్పడప్పుడు మాత్రమే కలిగేది. ఇక అర్ధరాత్రివేళ గోళీ తీసుకోవలసిన అవసరం చాలా అరుదుగా సంభవించేది. ఒకవేళ అటువంటి అవసరం వచ్చినా వెంటనే నిద్రపట్టేది.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య:
పేషంటు తనకు కలిగిన ఉపశమనానికి ముగ్దురాలై తన స్నేహితులకు కూడా వైబ్రో చికిత్సను సిఫారసు చేసారు.