నయం కాని మూర్చ 11591...India
18 సంవత్సరాల యువకుడు గత రెండు సంవత్సరాలుగా మూర్చ ను అనుభవిస్తూ సహయము కోసం 17 డిసెంబర్ 2017న ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. ఈ మూర్చ వచ్చినపుడు అతడు ఏ స్థితిలో ఉన్నా క్రిందపడిపోతాడు. కొన్ని సెకన్ల కాలం కొనసాగే ఈ మూర్చ రోజుకు 4-5 సార్లు అనుభవించవలసి వస్తోంది. ఆ తరువాత దీని గురించి ఏమీ గుర్తుండదు. ఇలా ప్రతీ రోజూ ఏ సమయంలో నైనా ఎక్కడైనా ఈ మూర్చ సంభవించవచ్చు. డాక్టర్లు దీనిని రిఫ్రాక్టరి (ఔషధ నిరోధక) మూర్చ గా నిర్ధారించి మెదడుకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. యితడు అలోపతి మందులు తీసుకుంటున్నా చెప్పుకోదగిన విధంగా ఫలితం కలుగలేదు.
ప్రాక్టీషనర్ అలోపతి మందులు కొనసాగిస్తూనే క్రింది రెమిడి తీసుకోవాల్సిందిగా సూచించారు:
CC10.1 Emergency + CC15.1 Mental & Emotional tonic + CC18.3 Epilepsy...TDS
రెమిడి తీసుకున్న మొదటి మూడు రోజుల వరకూ రోగికి విపరీతమైన దాహం అనిపించింది. ఐదవ రోజునుండి మూర్చలు తగ్గడం ప్రారంభించాయి. 10 వ రోజునాటికి మూర్చల సంఖ్య గణనీయంగా తగ్గి రోజుకు ఒకటికి చేరుకుంది. 15 వ రోజు నాటికి తన రెండు సంవత్సరాల బాధకు విమోచనంగా ఇవి పూర్తిగా తగ్గిపోయాయి.
20 వ రోజు నాటికి పేషంటు యొక్క అలోపతి మందుల మార్పు కారణంగా యితడు నిలబడలేక, కూర్చోలేక క్రిందపడిపోసాగాడు. ఇటువంటి పరిస్థితి లో ఇతనిని హాస్పటల్లో చేర్చగా చికిత్స చేసి మందును కూడా మార్చి మరునాడు పంపించి వేసారు.
25వ రోజు నుండి మూర్చలు పూర్తిగా ఆగిపోయి కొన్ని నెలల వరకూ రాలేదు. ఆ తరువాత 2-3 వారాల పాటు రోజుకు ఒకసారి మూర్చ కలిగేది. ఇతడు అలోపతి మరియు వైబ్రో మందులు కొనసాగిస్తూ ఉండగా ఆగస్టు చివరినాటికి అనగా రెండు నెలల కాలంలో ఒక్కసారి కూడా మూర్చ రాలేదు.