Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డిప్రెషన్, అజీర్ణము మరియు మలబద్దకం 11581...India


64 ఏళ్ల మహిళ 1990 లో తన భర్త యొక్క హఠాన్మరణము వలన మానసికంగా కుంగుబాటుకు గురై దీని కారణంగా ఈమెకు అజీర్ణము, మలబద్దకము ఏర్పడ్డాయి. ఈ విధంగా 15 సంవత్సరాల నుండి ఈమె బాధపడుతూ ఉన్నారు. ఈమెకు అధిక రక్తపోటు, చెక్కెర వ్యాధి వంటివేమీ లేవు. ఈమె అనేక సంవత్సరాలుగా డిప్రెషన్, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం కోసం అలోపతి మందులు వాడుతూ ఉండడంతో  అవి పనిచేయడం కూడా మానేసాయి. ఈమె ప్రాక్టీషనర్ వద్దకు వచ్చినప్పుడు ముఖం అంతా పాలిపోయి బ్రతుకు మీద ఆశ వదిలేసినట్లు కనిపించారు. ఈమె కుమారుడు పేషంటును తీసుకురాగా ఆమెకు ధైర్యం చెప్పి భగవంతుడు సహాయం చేస్తాడని వ్యాధి తప్పనిసరిగా తగ్గిపోతుందని  చెప్పడంతో పేషంటు చికిత్సకు సహకరించడంతో 23 జూన్ 2017న క్రింది రెమిడి ఆమెకు ఇవ్వడం జరిగింది:
# 1.  CC4.1 Digestion tonic + CC4.2 Liver&Gallbladder tonic + CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental &Emotional tonic…TDS

#2. CC15.1 Mental &Emotional tonic + CC15.2 Psychiatricdisorders + CC15.6 Sleepdisorders + CC17.2 Cleansing + CC17.3 Brain & Memory tonic…TDS

నెల రోజుల తరవాత  పేషంటు మానసిక ఆరోగ్యం 40% మెరుగయ్యింది. కనుక ఆమె వాడే అలోపతి మందులన్నీ మానేసి  #1 మరియు #2 లను 3 నెలల పాటు కొనసాగించారు.  

6 అక్టోబర్ 2017, పేషంటు తనకు మానసిక రుగ్మతలనుండి 100% మెరుగయినట్లు, అజీర్ణము, మలబద్ధకం నుండి 80% మెరుగయినట్లు చెప్పారు. #2ను 3 ఫిబ్రవరి 2018 వరకూ BD గానూ మరొక నెల వరకూ OD గానూ కొనసాగించారు. అనంతరం 9 మే 2018 నాడు రెమిడి మానేసే వరకూ దీనిని OW గా కొనసాగించారు.

అజీర్ణము విషయంలో మరొక నెల తర్వాత 90% శాతం మెరుగుదల కనిపించడం తో #1ను BDకు తగ్గించారు. మరలా పునరావృతం అవుతుందేమో అన్న భయంతో మే 9 నాటికి BD గా కొనసాగిస్తూనే ఉన్నారు. పేషంటు ప్రస్తుతం మానసికంగా శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ తన జీవన సరళిని మార్చుకొని ఆనందంగా జీవిస్తున్నారు.