Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కీళ్ళ నొప్పులు 01448...Germany


64 ఏళ్ల వ్యక్తి 35 సంవత్సరాలుగా  రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఇది తన వేళ్లు మరియు మణికట్టు కీళ్లలో వాపుతో ప్రారంభమై సంవత్సరాలు గడిచేకొద్దీ కాళ్ళకు, వీపుకు  వ్యాపించింది. వీరికి తన వేళ్లు, మణికట్టు, చేతులు, కాళ్ళు, మోకాలు మరియు వెనుక అన్ని కీళ్ళలో తీవ్రమైన నొప్పి మరియు కదలికలేక బిగుసుకుపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ  నొప్పి బాగా పెరిగిపోయి తన సాధారణ దినచర్యను కూడా నిర్వహించలేకపోయే పరిస్థితి ఏర్పడింది. ఉదయపు సమయాలలో ఈ  లక్షణాలు మరీ  అధ్వాన్నంగా ఉంటున్నాయి. తను  చేతుల్లో ఏదైనా పట్టుకోవడం కూడా సాధ్యమయ్యేది కాదు. దీనికి తోడు బలహీనంత కూడా ఏర్పడింది. నెమ్మదిగా తన వెన్నెముక దాదాపు 60° వంగిపోవడం జరిగింది. వ్యాధి యొక్క తీవ్రత  వీరి  కదలికలను శాశించడంతో  ఇంటికే  పరిమితమై ఉండేవారు. వీరు దశాబ్దాలుగా ప్రఖ్యాత కీళ్ళ నిపుణులచే సూచించిన అలోపతి మందులను ప్రయత్నించారు. వీరు గత 20 సంవత్సరాలుగా నొప్పి నిరోధక మందు డైక్లోఫినాక్  50mg ని BDగా తీసుకుంటూ ఉన్నారు. ఆ తరువాత ఇది అసేక్లోఫెనాక్ 100mg OD గా మార్చబడింది. దీనికారణంగా కడుపులో సమస్యలు ప్రారంభం కావడంతో వీరు ఓమేప్రజోల్ 40mg BDను తీసుకోవడం ప్రారంభించారు. ఇట్టి నిరాశవహ పరిస్థితిలో వీరు  భారతదేశం యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్లి అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రయత్నించారు కానీ ఏమీ ప్రయోజనం కానరాలేదు.  కీళ్ళ వైద్యులు మరింత నష్టం కలగకుండా ఉండడానికి గానూ శస్త్రచికిత్సద్వారా మోకాలి కీళ్ళను   "ఫ్యూజ్ ” చేయాల్సి వచ్చింది. దీనితో మోకాళ్ళు వంచే పరిస్థితి పూర్తిగా పోయి వీరి కదలికలు  మరింత తగ్గిపోయాయి. వీరు స్టెరాయిడ్ కాని నొప్పి నిరోధక ఔషధము (NSAID) సహాయంతో, ఇంటి లోపల మాత్రమే అనగా రెస్ట్ రూముకు వెళ్ళడం వంటివి సపోర్టు ద్వారా కనీస కార్యకలాపాలు నిర్వహించసాగారు. ఐతే సంవత్సరాలు గడిచే కొద్దీ NSAIDల యొక్క దుష్ప్రభావాలు పెరిగిపోయి రక్తపోటు,  అరిథ్మియా మరియు కాళ్ళలో వాపు వంటి సమస్యలకు కారణమయ్యాయి, దానికోసం వీరి కార్డియాలజిస్ట్ రామిప్రిల్ల్ 5mg BD ను సూచించారు. మొదటి ఔషధము యొక్క దుష్ప్రభావాలు ఎదుర్కొనేందుకు రెండవ ఔషధాన్ని తీసుకునే ఈ వలయాకార విధానము రోగిని మరింత ఒత్తిడి లోనికి నెట్టింది. ఇదే సమయంలో చేయించుకున్న రక్త పరీక్ష రుమటాయిడ్ కారకమును పాజిటివ్ గా చూపించింది. X- రే రిపోర్టు కూడా ఎముకలకు చాలా నష్టం సంభవించినట్లు  ధ్రువీకరించాయి.

ఇటువంటి పరిస్థితిలో 15 డిసెంబర్ 2015 న క్రింది రెమిడి పేషంటుకు ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.6 Osteoporosis + CC20.7 Fractures…QDS. 

నాలుగు వారాల తరువాత వ్యాధి లక్షణాలలో 30% మెరుగుదల కనిపించింది అందువలన పేషంటు తన నొప్పినివారణుల  మోతాదును తగ్గించారు. ఆరునెలల తరువాత, వీరికి 40% ఉపశమనం కలగడంతో NSAID నొప్పినివారణి మరియు ఓమెప్రజోల్ ను పూర్తిగా నిలిపివేసి, కేవలం వైబ్రో రెమిడిలను మాత్రమే తీసుకోసాగారు. తొమ్మిది నెలల తర్వాత, అభివృద్ధి 50% కు పెరిగింది. ఒక సంవత్సరం వైబ్రోరెమిడిలను వాడిన తర్వాత, వీరికి దాదాపు 80% ఉపశమనము లభించింది. 18 నెలల తర్వాత అనగా 2017 జూన్ నాటికి దాదాపు 90 శాతం ఉపశమనం కలిగింది. 2017 నవంబర్ నాటికి వీరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి వాపు, నొప్పి, గట్టిదనము వంటి లక్షణాలు 100% అదృశ్యమయ్యాయి. సూచించిన విధంగానే పేషంటు వైబ్రో రెమిడిలను క్రమంగా కొనసాగించసాగారు.

వీరికి తన మోకాళ్ళు ఫ్యూజ్ చేయడం వలన ఎల్లప్పుడూ ఊతకర్రలు అవసరము తప్పనిసరైనప్పటికీ   తీవ్రమైన దుష్ప్రభావాలుతో కూడిన ఖరీదైన మందులను తీసుకోకుండా ఇంటి లోపల తన కార్యకలాపాలు కొనసాగించగలుగు తున్నందుకు పేషంటు తనకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. అలాగే డిసెంబరు 2017 నుండి వైబ్రో రెమిడిలు ప్రారంభించినందున త్వరలోనే  గుండెలో సమస్యల నిమిత్తం వాడుతున్న రామిప్రిల్ల్ కూడా  ఆపేయాలని వీరు భావిస్తున్నారు.  

సంపాదకుని వ్యాఖ్య:
ప్రాక్టీషనర్ జర్మనీ లోనూ పేషంటు ఇండియా లోనూ ఉండడంతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి మెయిల్ ద్వారా రెమిడిలు పంపడం జరిగింది
.