Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

హైపో థైరాయిడిజం, దీర్ఘకాలిక దగ్గు, మరియు అస్తమా 03542...UK


26 జూలై 2016, తేదీన 60 సంవత్సరాల వయసుగల మహిళ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. 40సంవత్సరాల క్రితం మొదలయిన అస్తమా వ్యాధి ఆ తరువాత తగ్గిపోయినప్పటికీ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది. పరిస్థితి రానురానూ దిగజారుతూ గొంతులో గురకను అరికట్టడానికి ఈమె రోజుకు రెండుసార్లు ఇన్హేలర్ లేదా నెబ్యులైజర్ ఉపయోగించ వలసిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలలుగా ఈమెకు దగ్గు కూడా వస్తోంది. అలోపతి మందులు వాడుతున్నప్పటికీ ఫలితం కలుగలేదు. ఈ దగ్గు ఆమె అస్తమాను మరింత పెరిగేలా చేయడంతో డాక్టరు కూడా దిగజారుతున్న ఆమె పరిస్థితి చూసి ఆందోళన  చెందసాగారు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా హైపో థైరాయిడ్ కోసం  థైరాక్జిన్( thyroxine ) రోజుకు 100mg వాడసాగారు. అంతేకాక  రోజంతా  అలసటకు  గురైనట్లుగా ఉండడం వలన డాక్టర్ పర్యవేక్షణలోనే ఉండవలసి వస్తోంది. ఈమెకు లో బి.పి. కూడా ఉంది కానీ అలోపతి మందుల కారణంగా అది కంట్రోల్ లోనే ఉంది. .

ఈమెకు క్రింది రెమిడిలు  ఇవ్వబడినవి:

హైపో థైరాయిడిజం కొరకు:
#1. CC6.2 Hypothyroidism + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS

దీర్ఘకాలిక దగ్గు మరియు అస్తమా కొరకు:
#2. CC9.2 Infections acute + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic…TDS

నాలుగు వారాల తరువాత, తాను దగ్గు నుండి పూర్తిగా కోలుకున్నట్లు మరియు ఈ కాలంలో ఎట్టి అల్లోపతి మందులను తీసుకోలేదని ఆమె తెలిపారు. అస్తమా నుండి కూడా ఆమె 80%  ఉపశమనం కలగడం వలన ఈ కాలంలో ఆమె ఒకసారి కూడా ఇన్హేలర్ ను  ఉపయోగించుకోవాల్సిన అవసరం రాలేదు. మరొక రెండు వారాలలో, ఆమె థైరాయిడ్ ఫంక్షన్ గణనీయంగా మెరుగుపడడం వలన ఆమె తీసుకొనే థైరాక్సిన్ మోతాదును డాక్టర్ రోజుకు 50mg కి  తగ్గించారు. మొత్తంగా, వైబ్రో మందుల కారణంగా ఆమె చాలా ఆరోగ్యంగా మరియు ప్రశాంతముగా ఉన్నట్లు భావించారు. ఒక నెల తరువాత, ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన మరియు రక్త పరీక్షల ఫలితాల ప్రకారము ఆమె ఊపిరితిత్తులలో గణనీయమైన మెరుగుదల కనబడడం చూసిన  డాక్టర్ ఆశ్చర్యానికి అంతులేదు. 2016 డిసెంబరు 10, నాటికి  ఆమె తన ఆస్త్మా, దగ్గు మరియు హైపోథైరాయిడిజం నుంచి 100% ఉపశమనము పొందినట్లు తెలిపారు. వైబ్రియోనిక్స్ రెమిడిలు ప్రారంభించిననాటి నుండి ఆమె తన ఇన్హేలర్ను ఉపయోగించవలసిన అవసరం రాకపోయేసరికి  డాక్టర్ ఆమె ప్రిస్క్రిప్షన్ నుండి దానిని తొలగించారు. అందువలన పేషంటు #2 రెండు వారాల వరకూ BD గానూ, OD గా మరో 2 వారాలు, OW గా నెల రోజులు తీసుకోని ఆపివేశారు.  ఆమె హైపోథైరాయిడ్ కోసం ఏ అలోపతి మందులు అవసరం రాలేదు. అయితే, అభ్యాసకుడు ఆమె #1ను కొనసాగించమని సలహా ఇచ్చారు. ఐతే ఈ సమయంలో పేషంటు  కొన్ని వారాలు  విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. దురదృష్టవశాత్తు, ఆమె వైబ్రో రెమిడిలను వెంట తీసుకు వెళ్ళలేదు. ఆమె తిరిగి వచ్చిన తరువాత, మాములుగా చేయించుకొనే రక్త పరీక్ష ఫలితాన్ని చూసి డాక్టరు  ముందుజాగ్రత్త కోసం థైరాక్సిన్  50mg మందును మళ్లీ ప్రవేశపెట్టారు. ఫలితంగా, ప్రాక్టీషనర్ సూచన మేరకు #1ను ఫిబ్రవరి 2017 నుండి TDS గా తిరిగి ప్రారంభించబడింది. జూలైలో, ఆమె డాక్టర్ రోజువారీ థైరాక్సిన్ మోతాదును 25mgకి తగ్గించారు. నవంబర్ నుండి ఆమె #1 తీసుకోనప్పటికీ ఆమెకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది. జనవరి 2018 నాటికి, ఆమెకు ఆస్తమా కానీ  దగ్గుకానీ  తిరిగి రాలేదు.