పెద్ద ప్రేగులో వ్రణము 02802...UK
అనేక సంవత్సరాలపాటు పెద్దప్రేగులో వ్రణముతో బాధపడుతున్న 55 ఏళ్ల మహిళ, సెప్టెంబరు 6, 2014 న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వీరికి విరామం లేని నీళ్ళ విరోచనాల వ్యాధి మరియు కడుపు నొప్పి కూడా ఉన్నాయి. ఆమె బోవేల్స్/ప్రేవులు రోజుకు 4 నుండి 8 సార్లు తెరవబడతాయి. జీర్ణాశయ నిపుణుడి పర్యవేక్షణలో ఉన్న ఈ పేషంటుకు ప్రతి సంవత్సరం అనేక స్టెరాయిడ్స్ తో పాటుగా పెంటాసా 500 mg ని BD (IBS యొక్క స్వల్ప లేదా ఒక మోస్తరు గా వచ్చే నొప్పిని తగ్గించే మాత్రలు) గా సూచించారు.
పేషంటుకు క్రింది కాంబో ఇవ్వడం జరిగింది:
#1. CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic…TDS
రెమిడి తో పాటుగా పేషంటు తన అలోపతి మందులు కొనసాగించారు. 2015 మే 9 నాటికి పరిస్థితిలో మార్పు లేకపోయే సరికి ప్రాక్టీషనర్ రెమిడి ని క్రింది విధంగా మార్చారు:
#2. CC10.1 Emergencies + #1…TDS
పేషంటు క్రమం తప్పకుండా రెమిడి వాడినప్పటికీ ఏమాత్రం మార్పు కలగక పోవడంతో 1 అక్టోబర్ 2015 న ప్రాక్టీషనర్ క్రింది రెమిడి తో చికిత్స ప్రారంభించారు:
#3. Stool nosode prepared at 1M potency...TDS
రెమిడి ప్రారంభించిన రెండు వారాలలోనే 50% మరియు ఆరు వారాలలోనే 80% ఉపశమనం కలిగింది. పేషంటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జీర్ణాశయ నిపుణుడు,మొదట ఈమె రోగ లక్షణాల నివారణకు అజాతియోప్రిన్ Azathioprine (క్రోన్ వ్యాధి నివారణకు వాడే ఒక మందు) ఇద్దామనుకున్నా పేషంటు పరిస్థితి మెరుగ్గా ఉన్నందున దానిని ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నాడు. తొమ్మిది వారాల తరువాత ఉపశమనం కలగడంతో అలోపతి మందుల అవసరమే లేకుండా పేషంటు భారతదేశానికి ప్రయాణించగలిగారు. ఫిబ్రవరి 2016లో సమీక్షించినప్పుడు ఆమె తన పెద్దప్రేగు వ్రణము పూర్తి నియంత్రణలో ఉండడంతో #3 మినహాయించి మరే ఇతర మందులు తీసుకోవడం నిలిపి వేసారు. తనకు బాగా మెరుగవడం వలన ఆమె మోతాదును OD కి తగ్గించి,జూన్ 2016లో పూర్తిగా నిలిపివేసారు. ఆగష్టు 2016లో ఆమె పెద్దప్రేగు వ్రణము స్వల్పంగా పునరావృత మైనట్లు గమనించి, #3 పునఃప్రారంభించగానే మరలా మెరుగుదల కనిపించింది. కనుక రెమిడి ఆపడానికి ముందు #3 OD గా ఎక్కువ సమయం కొనసాగించాలని సూచింపబడడంతో పేషంటు అలాగే చేసారు. 2018 జనవరి లో ప్రాక్టీషనర్ సమీక్ష లో పేషంటు వైబ్రో మందులను తీసుకోవడం లేదని ఆమె పెద్దప్రేగు వ్రణము ఏమాత్రం పునరావృతం కాకుండా ఆమె ఆనందంగా ఉన్నట్లు తెలిసింది.