అరి పాదాల పైన దురద మరియు పొక్కులు 11585...India
11 సంవత్సరాల బాబు గత రెండు సంవత్సరాలు గా అరిపాదాల లలో దురద మరియు పోక్కులతో బాధపడుతూ ఉన్నాడు. ఈ సమస్య వర్షాకాలం చివరిలో స్వల్పంగా దురదతో ప్రారంభమయ్యింది. దురద అనిపించినప్పుడల్లా ఉపశమనం కోసం రెండుకాళ్ళు ఒకదానితో ఒకటి రుద్దుతాడు. దీనివలన పొక్కులు చితికి ఒక విధమైన రసి కారుతూ పుండ్లుగా మారి బాధను మరింత పెంచుతున్నాయి. ఈ బాధ కారణంగా బాబు పాఠశాలకు బూట్లు వేసుకొని వెళ్ళ లేక పోతున్నాడు. బాబు అలోపతి మరియు హోమియోపతి మందులు వరుసగా 6 నెలల చొప్పున వేసుకున్నాడు కానీ ఉపశమనం కలుగలేదు. అందువలన బాబు తల్లి మందులు వేయడం ఆపి 2017 మే 31న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు..ప్రాక్టీషనర్ బాబుకు క్రింది రెమిడి ఇచ్చారు.
CC12.2 Child tonic + CC21.8 Herpes + CC21.11 Wounds & Abrasions…TDS
ఒక వారం రెమిడి వాడగానే బాబు దురద వల్ల కాళ్ళు రుద్దడం మానేసాడు. దురద 50% వరకూ తగ్గిందని చెప్పాడు. మరో రెండు వారాలు వాడిన తర్వాత 80%మెరుగుదల వచ్చిందనీ దురద పూర్తిగా తగ్గిందని పొక్కులు చాలావరకూ తగ్గిపోయాయని చెప్పాడు. ఇదే డోసేజ్ ను మరో రెండు వారాలు వాడాడు. దీంతో అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. బాబు తల్లిదండ్రులకు ఆనందం ఉపాధ్యాయులకు ఆశ్చర్యం కలిగే రీతిగా బాబు బూట్లు ధరించిస్కూలు కు వెళ్ళడం ప్రారంభించాడు.
2017జూలై 5 వ తేదీన డోస్ తగ్గించడం ప్రారంభమయ్యింది. ప్రాక్టీషనర్ డోసేజ్ ను BD గా రెండు వారాలు, OD రెండు వారాలు,మరియు OW గా మూడు వారాలు కొనసాగించడం జరిగింది. 2017ఆగస్టు 18 వ తేదీన బాబు తల్లి వారి అబ్బాయికి పూర్తిగా తగ్గిపోవడంతో రెమిడి వేయడం మానేసినట్లు చెప్పారు. 2017అక్టోబర్ నాటికి బాబుకు తిరిగి మునుపటి వ్యాది చిహ్నాలు ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నాడని తెలిపారు.