కృశించిపోతున్న మొక్క 03108...Greece
2017 వ సంవత్సం వేసవిలో ప్రాక్టీ షనర్ తమ ఇంట్లో పెరుగుతున్న గార్డెనియా మొక్కకు గత కొన్ని వారాలుగా కొత్తగా వస్తున్న ఆకులతో పాటు పాతవన్నీ పసుపురంగులోనికి మారిపోతున్నాయి. గార్డెనియా మొక్కలలో ఇది సహజమే దానికి కారణాలు కనుగొనలేము. వీరి తోటమాలి మొక్కకు కావలసిన ఐరన్, మెగ్నీషియం, వంటి పోషకాలన్నీ వేసారు కానీ ఫలితం లేదు.ఆ తర్వాత నేల యొక్క pH విలువ ఎంత ఉందో తెలుసుకొని నీరు పోయడం కూడా తగ్గించారు. కానీ మార్పేమీ లేదు. తన ప్రయత్నమంతా చేసిన తర్వాత ఇక ఆ మొక్క బ్రతకడం కష్టమని దాన్ని వ్రేళ్ళతో సహా పెకలించివేయాలని అనుకొన్నారు.
ఏమైనప్పటికీ ప్రాక్టీషనర్ 2017 జూలై 24 న మొక్కకు వైబ్రియో మందు ఇవ్వాలని తలచారు (ఫోటో చూడండి).
ఆమె ఒక చుక్క CC1.2 Plant tonic ను ఒక కప్పు నీటిలోవేసి రోజుకు 3-4 చొప్పున నాలుగు రోజులు ఇచ్చారు. అదే సమయంలో మొక్కతో మాట్లాడుతూ తన ప్రేమంతా వ్యక్త పరుస్తూ త్వరగా కోలుకోవలసిందిగా మొక్కను కోరారు.
నాలుగు రోజుల తర్వాత ఆమె ఏమీ గమనించారంటే ఆకుపచ్చగా ఉన్న ఆకులన్నీ అలాగే తాజాగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రాక్టీషనర్ అనుకోకుండా నెల రోజుల పాటు ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఐతే మొక్కకి ఆటోమాటిక్ గా నీళ్ళు వెదజల్లే విధంగా స్పింక్లెర్ మిషనును ఏర్పాటు చేసి వెళ్లారు. ఆమె వెళ్ళినప్పుడు ఎథెన్స్ నగరంలో వేసవి తాపం చాలా ఎక్కువగా ఉంది.
కానీ సెప్టెంబర్ లో ప్రాక్టీ షనర్ తిరిగి వచ్చినప్పుడు వారిని అత్యంత ఆనందానుభూతి కి లోనుచేస్తూ మొక్క పచ్చగా ఆరోగ్యంగా కనిపించింది.
అక్టోబర్ లో తీసిన మరొక ఫోటో మొక్క ఆరోగ్యంగా అలానే పెరుగుతోందని దీనియొక్క ఆకుల సంఖ్య మరియు పరిమాణం కూడా పెరిగాయని సూచిస్తుంది.